బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా సక్సెస్ చుట్టూనే ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉంటారు. సక్సెస్ అనేది దర్శకుడికి ఉంటే ఆ దర్శకుడు చుట్టూనే తిరుగుతూ ఉంటారు హీరోలు అందరూ. ఆ విధంగా తెలుగు సినిమాల్లో సక్సెస్ సాధించిన దర్శకులు ఎవరు కూడా ఖాళీగా లేరు. ఇప్పుడు అందరూ కూడా రెండేసి మూడేసి సినిమాలు ఒకే చేసుకుని ఫుల్ కమిట్ మెంట్ లతో బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సుకుమార్. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇంటలెల్చువల్ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయనకు ఇపుడు భారీ సక్సెస్ ఉంది.

ఆయన దర్శకత్వం వహించిన పుష్ప సినిమా భారీ విజయం సాధించి ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. దాంతో ఆయనకు దేశం అంతటా మంచి క్రేజ్ మరియు డిమాండ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి దర్శకుడిగా రాజమౌళి ఒక్కడికే మంచి పెద్ద పేరు ఉండేది కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా విడుదల అయిందో అప్పటినుంచి రాజమౌళి తర్వాత సుకుమార్ పేరు కూడా దేశమంతటా వినిపించడం మొదలైంది. ఆ విధంగా పుష్ప సినిమా సుకుమార్ పేరు దేశ స్థాయిలో వినిపించే విధంగా చేసింది అని చెప్పవచ్చు. 

అయితే నార్మల్ హిట్ కొట్టిన దర్శకుడుకే మన హీరోలు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఆయనతో సినిమాలు చేయాలని కోట్ల కొద్దీ అడ్వాన్స్ లు తమ నిర్మాతల దగ్గర్నుంచి ఇప్పిస్తూ ఉంటారు. అలాంటిది సుకుమార్ దేశమంతా మెచ్చే దర్శకుడు అయ్యాడు కనుక ఈ దర్శకుడితో సినిమా కోసం అందరు హీరోలు కూడా క్యూలు కట్టారు. ఈ నేపధ్యంలో సుకుమార్ తన లైనప్ ను ఎంతో బలం గా ఏర్పరుచుకున్నాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ తో ఆయన సినిమా చేస్తుండగా ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడు. పుష్ప 2 చిత్రాన్ని దసరా కు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: