బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ హీరో అయ్యాడు ప్రభాస్. ఆయన సినిమా అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎలాంటి హడావిడి ఉంటుందో అలానే ఇండియా వైడ్ హంగామా ఏర్పడుతుంది. బాహుబలి రెండు పార్టుల తర్వాత వచ్చిన సాహో తెలుగులో జస్ట్ ఓకే అనిపించినా నార్త్ సైడ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక రాబోతున్న రాధేశ్యామ్ సినిమా విషయంలో కూడా నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ ఏర్పడింది. రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా అసలైతే ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అది రాలేదు.

అయితే సినిమా రిలీజ్ కాకపోయినా సరే ప్రభాస్ సంక్రాంతి సందడి షురూ చేస్తున్నారు. అదెలా అంటే సంక్రాంతి అనగానే గాలిపటాలు ఎగరేయడం. మార్కెట్ లో రకరకాల గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రభాస్ క్రేజ్ తో రాధేశ్యామ్ కైట్స్ దర్శనమిస్తున్నాయి. ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా రాధేశ్యామ్ గాలిపటాలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాధేశ్యామ్ గాలి పటాలు వైరల్ గా మారాయి. సంక్రాంతికి సినిమా రాకపోయినా సరే ఈ విధంగా కూడా రాధేశ్యామ్ సినిమా హంగామా చేస్తుంది.

ఇక సినిమా విషయానికి వస్తే రాధేశ్యామ్ సినిమాని యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. సౌత్ భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు. థమన్ రాధేశ్యామ్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. రాధే శ్యాం సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు మేకర్స్. సినిమా ఎప్పుడొచ్చినా సరే రాధేశ్యామ్ ప్రభాస్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం ఖాయమని డైరక్టర్ రాధాకృష్ణ వెల్లడించారు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాని సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: