ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే తాము నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారు. ఇలా నటించిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న హీరోయిన్ లలో పొడుగు కాళ్ల సుందరి ఫారియా అబ్దుల్లా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కె వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కామెడీ ప్రధాన నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. 
ఇప్పటికే ఈ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ సాంగ్ కి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను, ఇతర విషయాలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ పొడుగుకాళ్ల సుందరి అప్పుడప్పుడు తన హాట్ హాట్ అద్దాల తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో  పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం కూడా పరి ఫారియా అబ్దుల్లా కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ పొడుగుకాళ్ల సుందరి వైట్ డ్రెస్ వేసుకొని, మెడలో ఒక లాకెట్ ను వేసుకుని కొంటెగా చూస్తూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఫారియా అబ్దుల్లా కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుత కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: