సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క కరోనా బారిన పడటం ఈ టైం లోనే మహేష్ అన్నయ్య రమేష్ బాబు మృతి చెందడం ఫ్యాన్స్ ని బాధపెట్టాయి. అసలైతే సంక్రాంతి సందర్భంగా సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఓ సర్ ప్రైజ్ టీజర్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీజర్ రిలీజ్ చేసే ఆలోచన విరమిచుకున్నారట. సన్ర్కాంతి సందర్భంగా సర్కారు వారి పాట నుండి ఓ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తారని టాక్.

అన్నయ్యని పోగొట్టుకున్న బాధలో ఇప్పుడప్పుడే మహేష్ మీడియా ముందుకు వచ్చే ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తుంది. కొవిడ్ నెగటివ్ వచ్చినా కొన్నాళ్లు బయటకు రాకుండా ఉండాలని మహేష్ ఆలోచిస్తున్నాడట. కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ వచ్చాక అన్నయ్య ఇంటికి వెళ్లి నివాళి అర్పించి ఆ తర్వాత బయటకు రాకుండా ఉండాలని అనుకుంటున్నారట. తను కొవిడ్ బారిన పడటం ఆ టైం లోనే అన్నయ్యని దూరం చేసుకోవడం లాంటివి మహేష్ ని చాలా బాధపెట్టాయని తెలుస్తుంది. అందుకే తన సినిమాలకు సంబందించిన హ్యాపెనింగ్స్ ని అన్నిటిని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

జస్ట్ సంక్రాంతి సందర్భంగా ఫ్యాన్స్ ని విష్ చేస్తూ సర్కారు వారి పాట నుండి ఒక పోస్టర్ మాత్రం రిలీజ్ చేస్తారని టాక్. పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని టాక్. మహేష్ ఈ సినిమాలో పోకిరి లుక్ తో కనిపిస్తాడని ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో అర్ధమైంది. అంతేకాదు సర్కారు వారి పాట సినిమా కూడా ఏప్రిల్ 1న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమని టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: