సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తరచూ ఏదో ఒక డిఫరెంట్ లుక్ మరియు హెయిర్ స్టైల్ అలాగే విభిన్న వస్త్రధారణ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నారు

ఈ క్రమంలోనే కొన్నిసార్లు వారి స్టైల్ ప్రేక్షకులను ఆకట్టు కోగా మరికొన్నిసార్లు వారు దారుణమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటి మరియు సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనే విషయంలో కూడా ఇలాగే జరిగింది.ఒక వినూత్న ప్రయత్నం ద్వారా సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మకు నెటిజన్ల నుంచి చేదు అనుభవం ఎదురయిందట.. దీపికా పదుకొనే ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేశారు.హెయిర్ ఫ్లిప్ ట్రెండ్‌ను ప్రయత్నించిన ఆమె దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారని తెలుస్తుంది.. ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమయానికి దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కు గురైనట్లు సమాచారం.ఈ ఫోటోని షేర్ చేసిన దీపిక అందరి దృష్టిని ఆకర్షించడానికి ఈహెయిర్ ఫ్లిప్ ట్రై చేశానని అయితే ఇది ఎపిక్ ఫెయిల్‌గా మారిందని వెల్లడించిందట.ఇక ఈ పోస్ట్‌ పై స్పందించిన నెటిజన్లు తమదైన విధముగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఇన్ని రోజులు సినిమాలలో సంపాదించిన డబ్బు మొత్తం ఎక్కడ పెట్టారు మేడమ్.ఆ డబ్బుతో కాస్త షాంపూ లేదా నూనె కొనుక్కోవచ్చు కదా అంటూ కామెంట్ చేయగా... మరొక నెటిజన్ మాత్రం విద్యుత్ తీగలు పట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో అలా ఉంది అంటూ తన హెయిర్ స్టైల్ పై నెటిజన్లు విభిన్నముగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొనేకి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.అయితే ఆమె అభిమానులు మాత్రం ఆమె ఎలాంటి పిక్ పెట్టిన కూడా సూపర్ అంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: