అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య కలిసి చేసిన మూవీ బంగార్రాజు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు కొనసాగింపు కథగా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ చాలా ఏళ్లు కష్టపడి బంగార్రాజు సినిమా కథ సిద్ధం చేశాడు. ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు అక్కినేని ఫ్యాన్స్ ని అలరించడం పక్కా అని అంటున్నారు.

అయితే సినిమా ఈవెంట్ లో భాగంగా సినిమాలో నాగ చైతన్య గురించి స్పెషల్ గా మాట్లాడారు నాగార్జున. సినిమాలో చైతన్య చాలా కొత్తగా కనిపిస్తాడని.. సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అంటే నాగ చైతన్యనే అని చెబుతున్నారు. బంగార్రాజు సినిమాలో నాగార్జున కొన్ని సీన్స్ వరకే పరిమితం అవుతారట. అసలు కథ మొత్తం నాగ చైతన్యనే నడిపిస్తాడని అంటున్నారు. అయితే పాత్రల ప్రాధాన్యత బ్యాలన్స్ గా సాగిందని తెలుస్తుంది.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున ఒక్కఏ డ్యుయల్ రోల్ చేశాడు. కానీ బంగార్రాజు సినిమాలో చిన బంగార్రాజుగా నాగ చైతన్య నటించాడు. ఆయనకు జోడీఆ కృతి శెట్టి సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని అంటున్నారు. తప్పకుండా బంగార్రాజు అక్కినేని ఫ్యాన్స్ కు మరో అద్భుతమైన సంక్రాంతి సినిమాగా నిలుస్తుందని చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ గా రిలీజ్ అవుతుంది. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేని నాగార్జునతో పాటుగా మరో పక్క హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న నాగ చైతన్య ఇద్దరు కలిసి చేసిన ఈ బంగార్రాజు మూవీ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. మరికొద్ది గంటల్లో సినిమా ఫస్ట్ టాక్ రాబోతున్న బంగార్రాజు సినిమాపై అన్నిచోట్ల పాజిటివ్ బజ్ ఏర్పడింది. నాగార్జున మాత్రం ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: