తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సినిమాలు చేసి ఎక్కువ క్రెజ్ తెచ్చుకున్న హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఆయన తన సినిమాలలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్న విశ్వక్ సేన్ గత సినిమా పాగల్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. ఆయన నటించిన ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో విజయాలను అందుకున్న విశ్వక్ సేన్ పాగల్ సినిమాతో నిరాశ చెందారు. అంతేకాదు.. యువహీరోగా తన కొత్త సినిమాను మాత్రం వెరైటీగా ప్రమోట్ చేస్తున్నాడు.

అయితే విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం పేరుతో ఒక సినిమా చిత్రీకరించనున్నారు. ఇక కొన్నిరోజుల క్రితం పెళ్లి కొరకు చింతా మ్యారేజ్ బ్యూరోను సంప్రదించానని విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఆ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. కాగా.. తాజాగా విశ్వక్ సేన్ రెండు రోజుల సమయం మాత్రమే ఉందని పిల్లని వెతికిపెట్టాలని ఒకవేళ పిల్లను వెతికిపెట్టడం సాధ్యం కాకపోతే కనీసం అమ్మాయిని పడేసే చిట్కాలు అయినా ఇవ్వాలని సోషల్ మీడియా వేదికలో తెలిపారు.

అంతేకాదు.. #helpallamfindpellam హ్యాష్ ట్యాగ్ తో సూచనలను తెలియజేయాలని విశ్వక్ సేన్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక వయస్సు మూడు పదులు దాటేసిందని జుట్టు, పొట్ట ఇలా అనేక కష్టాలు ఉన్నాయని ఒక్క సంబంధం చూసి అల్లానికి పెళ్లాన్ని వెతికిపెట్టడంలో సాయం చేయాలని విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికలో తెలిపారు. ఈ యువహీరో మోషన్స్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి మరి.

ఇక ఈ నెల 15వ తేదీన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందని విశ్వక్ సేన్ చెప్పకనే చెప్పారు. ఈ చిత్రం నుండి సంక్రాంతి కానుకగా టీజర్ లేదా ట్రైలర్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సినిమాకి బాపినీడు సుధీర్ ఈదర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: