ఇండస్ట్రీలో నటులకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు వరుస సినిమా రిలీజ్ తో కోలాహలంగా ఉంటుంది. సంక్రాంతికి విడుదలైన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే 2016 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో జనవరి 14వ తేదీ ఈ సినిమా విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నారు.

అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునసినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించిన నాగార్జున ఈ సినిమాలో నాగచైతన్యను తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలిపారు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ యూత్ కి కనెక్ట్ కాలేకపోయిందని అన్నారు. అందుకే.. ఆ సినిమాను మించి ఉండేలా ఇందులో నాగచైతన్య చిన్న బంగార్రాజు పాత్రలో నటించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో యాంకర్ నాగార్జునను ప్రశ్న అడుగుతూ ఈసినిమాలో మీరు మీ అబ్బాయి నటించినప్పుడు మీ నాన్నగారు గుర్తొచ్చారా అంటూ ప్రశించింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇక నాగార్జున మాట్లాడుతూ మనం సినిమా మేము కాకుండా వేరే ఆర్టిస్టులతో చేసి ఉంటే అంతగా వర్కౌట్ అయ్యేది కాదని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో నాన్న, నేను, నాగ చైతన్య ముగ్గురిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా వర్కౌట్ అయ్యేది కాదని అన్నారు.

అంతేకాదు.. నేను పంచే కట్టిన ప్రతిసారీ నాన్నగారే గుర్తొస్తారని ఈ సందర్భంగా నాగార్జున దివంగత నాగేశ్వరరావు గురించి తలచుకుని ఎమోషనల్ అవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: