జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం లో నటించిన సినిమా అదుర్స్.. ఈ సినిమాను ఎన్టీఆర్ అభిమానులే కాకుండా.. ఇతర ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఇందులో బ్రహ్మానందం, ఎన్టీఆర్ చేసే కామెడీ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. అప్పుడప్పుడు ఇందులోని సన్నివేశాలు బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని సరికొత్త యాంగిల్ తో కామెడీ రోల్ పాత్రలో చేయించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పనిచేశారు. ఇందులో కథానాయకులుగా నయనతార ,షీలా నటించారు. ఈ సినిమా 2010వ సంవత్సరంలో జనవరి నెలలో విడుదలై సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తి కావస్తోంది.. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్ రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-7.90 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-6.10 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.55 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.65 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.37 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.45 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.58 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-1.7 కోట్ల రూపాయలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..23.67 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ -2.87కోట్ల రూపాయలు.
11). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..26.54 కోట్ల రూపాయలను రాబట్టింది.

అదుర్స్ సినిమా.. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..23.8 కోట్లకు జరగగా ఈ సినిమా ముగిసే సమయానికి..26.54 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో బయ్యర్లకు ఏకంగా 2.74 కోట్ల రూపాయలు లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇక సంక్రాంతికి ఈ సినిమాకి పోటీగా హీరో వెంకటేష్ నటించిన నమో వెంకటేశ, రవితేజ నటించిన శంభో శివ శంభో.. వంటి సినిమాలు విడుదల కాగా.. అదుర్స్ సినిమా నే 2010 సంక్రాంతి విన్నర్ గా నిలిచిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: