కొంత మంది హీరో లకు ఓ పట్టాన విజయం వచ్చి వరించదు. వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా సక్సెస్ మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఏ సినిమా చేసినా కూడా ఎంతటి వైవిధ్యభరితమైన కథను ఎంచుకున్న కూడా ఏదో ఒక విధంగా వారికి దాని ద్వారా ఫ్లాప్ వస్తూనే ఉంటుంది. మంచి నటన కనబరిచిన కూడా వారికి ఫ్లాప్ ఎదురు కాక తప్పడం లేదు. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది హీరో ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అలా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

యంగ్ హీరో నితిన్ భీష్మ సినిమా విజయం తర్వాత చేసిన రెండు సినిమాలతో భారీ ఫ్లాప్ లు అందుకని మరొక విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరి ఆయన ఇప్పుడు చేస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాతో హిట్ అందుకుంటాడా చూడాలి.  మరొక హీరో నాగ శౌర్య వరుసగా ఫ్లాప్ లానే అందుకుంటున్నాడు. ఆయన వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాపులు తప్ప ఆయనకు కనీస విజయం కూడా అందడం లేదు. దాంతో తనకు ఎప్పుడు విజయం వస్తుందా అని ఎంతో బాధ పడడం నాగశౌర్య వంతు అయ్యింది. 

ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తో విజయం సాధించి అప్పటినుంచి అంతటి స్థాయి విజయం కోసం తపస్సు చేస్తూనే ఉన్నాడు హీరో కార్తికేయ. ఆయన ప్రస్తుతం వలిమై సినిమా లో విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా వరుస ఫ్లాప్ లి ఎదురవుతున్న కూడా విజయం కోసం తన పోరాటాన్ని ఆపడం లేదు. ఇప్పటికే ఆయనకు వరుసగా అరడజనుకు పైగా ఫ్లాపులు వరించాయి. ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ కి కూడా గత కొన్ని సినిమాలుగా ఫ్లాప్ లే పలకరిస్తున్నాయి ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాతోనైనా బిజీ అనుకుంటా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: