టాలీవుడ్‌లో ఉన్న కొంద‌రు హీరోల‌కు సొంత పేర్లే క‌లిసిరాలేదు. అస‌లేం జ‌రిగిందంటే.. కొంద‌రు హీరోలు త‌మ పేర్ల‌నే టైటిల్‌గా పెట్టుకుని సినిమాలు చేశారు. కానీ, విచిత్రం ఏంటంటే అలా వ‌చ్చిన సినిమాల‌న్నీ ఫ్లాపులుగానే నిలిచి.. ఆయా హీరోల‌ను నిండి ముంచాయి. మ‌రి ఇంత‌కీ సొంత పేర్లనే టైటిల్ గా పెట్టుకుని సినిమాలు తీసిన హీరోలు ఎవ‌రెవ‌రో ఓ లుక్కేసేయండి.

నాగార్జున‌: టాలీవుడ్ కింగ్ నాగార్జున‌ త‌న పేరుతో `కెప్టెన్ నాగార్జున` అనే చిత్రం చేశాడు. వి.బి.రాజేంద్రప్రసాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కుష్బూ హీరోయిన్‌గా న‌టించింది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై వి.బి.రాజేంద్రప్రసాద్ స్వయంగా నిర్మించారు. కానీ, 1986లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి త‌న పేరుతో రెండు సినిమాలు చేశారు.  1985లో `చిరంజీవి` టైటిల్‌తో ఓ సినిమా చేశారు. కన్నడ సినిమా నేనే రాజాకు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. ఆ త‌ర్వాత  కె. విజయభాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో `జై చిరంజీవ‌` టైటిల్‌తో మ‌రో చిత్రం చేయ‌గా.. ఇదీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

అఖిల్ అక్కినేని: నాగార్జున త‌న‌యుడైన అఖిల్‌.. త‌న తొలి చిత్రాన్నే త‌న పేరుతో తీశాడు. వి.వి. వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో నితిన్‌ నిర్మాణంలో రూపుదిద్దుకున్న `అఖిల్‌` సినిమా 2015లో విడుద‌లై భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దీంతో నిర్మాత నితిన్‌కి భారీ న‌ష్టాలు మిగిలాయి.

రామ్ చ‌ర‌ణ్‌: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న పేరు క‌లిసి వ‌చ్చేలాగా చేసిన చిత్రం `వినయ విధేయ రామ`. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించింది. భారీ అంచ‌నాల న‌డుమ 2019లో రిలీజైన ఈ మూవీ కూడా ఫ్లాపే అయింది.

ఇక విక్ట‌రీ వెంక‌టేష్ తన సొంత పేరు టైటిల్‌గా చేసిన సినిమా వెంకీ మామ, నాగ‌ చైత‌న్య చేసిన దోచెయ్‌, ఎన్టీఆర్ చేసిన రామయ్యా వస్తావయ్యా చిత్రాలు కూడా ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: