బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమానే బంగార్రాజు.. ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ చాలా అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు.. భోగి పండుగ సందర్భంగా ఈరోజు అనగా 14 వ తేదీన ఉదయం విడుదలైన ఈ సినిమా మొదటి షో తోనే ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది. ఇక సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రేక్షకాదరణ ఎంతైతే లభించిందో అంతకుమించి స్థాయిలో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుండడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు.


మునుపెన్నడూ నటించిన విధంగా సరికొత్తగా శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య పర్ఫామెన్స్ ను బయటపెట్టిన విషయం తెలిసిందే. లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నాగచైతన్య అదే ఊపుతో తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గించుకో కుండా బంగార్రాజు సినిమాల్లో కూడా పూర్తిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. లవ్ స్టోరీ సినిమా లో నటన కంటే మించిన ప్రతిభను కనబరిచిన నాగచైతన్యకు ఈ సినిమా చాలా ప్లస్ పాయింట్ అయ్యేలాగా కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో సర్పంచ్ పాత్ర లో కృతి శెట్టి నటన కూడా చాలా అద్భుతంగా ఉంది.

ఇక కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. నాగార్జున , రమ్యకృష్ణ ఎప్పటిలాగే తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా అలరించారు.. కాకపోతే నాగచైతన్య నటన ఎలా ఉండబోతోందో అని అందరు ఎదురు చూస్తూ ఉండగా అందరి అంచనాలకు మించి తన నటనను కనబరిచినట్లు తెలుస్తోంది.. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా నాగచైతన్య నటన గురించి మాట్లాడుకోవడం గమనార్హం.. లవ్ స్టోరీ సినిమా నాగచైతన్య కు బాగా కలిసి వచ్చిందని.. ఆ విజయంతోనే ఆయన బంగార్రాజు సినిమా తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: