అక్కినేని పండుగ
పెద్ద పండుగ
తెలుగు వారి లోగిలికి పండుగ
సినిమా పండుగ సోగ్గాడి పండుగ
అదిరింద‌య్యో!


 
ఇప్పుడున్న‌దంతా క‌ష్టాల కాలం..స‌వాళ్ల కాలం..అలాంటి స‌మ‌యంలో ఈ పుష్య మాస వేళ‌ల్లో సంక్రాంతి హేలల్లో వ‌చ్చిన సినిమా పండుగ బంగార్రాజు.ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న విధంగానే పండ‌గ స‌ర‌దాల‌న్నీ మూట గ‌ట్టుకుని ఇక్క‌డికి వ‌చ్చి ఆనందాల‌ను నింపింది.ముందుగా ఈ సినిమా రూప‌క‌ల్ప‌న లో అన్నీ తానై న‌డిపిన నాగ్ కు శుభాకాంక్ష‌లు  చెప్పాలి.అలానే ఎన్నో అవ‌రోధాలు ఉన్నా కూడా సినిమా విడుద‌ల విష‌యంలో ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌కుండా ఆయ‌న చూపించిన గ‌ట్స్ ను మెచ్చుకోవాలి.

ఇవాళ విడుద‌ల‌యిన బంగార్రాజు సినిమా మామూలుగా కాదు అదిరిపోయే రిజ‌ల్ట్ అందుకుంది.సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది ..ముందు నుంచి నాగ్ చెప్పిన మాట‌ల వ‌ల్లే అన్న‌ది నిర్వివాదాంశం.ఆయ‌న చెప్పిన మాట‌లు,సినిమాపై ఆయ‌న‌కు ఉన్న న‌మ్మ‌కం,విశ్వాసం ఇవ‌న్నీ ఈ సారి బాగా నెగ్గాయి.నాగ్ .. వ‌య‌సెక్క‌డా క‌నిపించకుండా క‌నిపించిన తీరు, న‌టించిన రీతి ఇవ‌న్నీ

సినిమా స్థాయిని మ‌రింత పెంచాయి. ముఖ్యంగా సినిమా మొద‌టి నుంచి ఆఖ‌రిదాకా క‌థ‌న రీతిలో క‌ట్టిప‌డేస్తుంది.గుడ్ స్క్రీన్ ప్లే తో పాటు గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్న‌వి ఈ సినిమాకు అద‌నపు బ‌లాలు.అంతేకాదు విజువ‌ల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి మంచి టాక్ న‌డుస్తోంది.


ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమా రూపుదిద్దించిన వైనం ఈ సంక్రాంతి సినిమా వైభోగానికి మ‌రింత అందం చేకూర్చేదే!
క‌ల్యాణ్ కృష్ణ, అనూప్,ఇంకా విఎఫ్ఎక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ కు ప‌నిచేసిన సాంకేతిక నిపుణుల సాయం సినిమా స్థాయిని పెంచి వారి క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం అందించింది. తెలుగు వారంతా ఎంతో ఆనందించే స‌కుటుంబ స‌ప‌రివార స‌మేత సినిమాగా ఈ ఏడాది మేటి చిత్రాల‌లో ముందు వ‌రుసలో ఉండే విధంగా నాగ్  చేసిన ప్లానింగ్ అంతా వ‌ర్కౌట్ అయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కు అన్న‌పూర్ణ స్టూడియో ఎంతో స‌మ‌యం వెచ్చించింది. అది కూడా ఎక్క‌డా వృథా కాలేదు.ఎడిట‌ర్ విజ‌య్ ను ఇప్ప‌టికే నాగ్ ప్ర‌శంసించారు.సినిమా వ‌ర్క్ న‌డుస్తున్న‌న్ని రోజులూ రోజుకు మూడు గంట‌ల‌పాటే నిద్ర‌పోయి మిగ‌తా స‌మ‌యం అంతా ఎడిటింగ్ వ‌ర్క్ కే కేటాయించి మంచి ఔట్ పుట్ ఇచ్చార‌ని నిన్న‌టి వేళ నాగ్ చెప్పారు.అదే  నిజం అయింది కూడా!




మరింత సమాచారం తెలుసుకోండి: