ఓసారి నూతన సంవత్సరం సందర్భంగా హీరోయిన్ యమున మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన ఇంటికి వెళ్ళిందట. కానీ, ఆ సమయంలో చిరంజీవి ఇంట్లో లేరట. అయితే యమున ఇంటికి రావడాన్ని గమనించిన పవన్ కళ్యాణ్..ఎదురెళ్లి మళ్లీ ఆహ్వానించారట. అలాగే `అన్నయ్య లేరు గుడికి వెళ్లారు కాసేపు అవగానే వచ్చేస్తారు. అప్పటి వరకు ఇక్కడ కూర్చోండ`ని పవన్ చెప్పాడట.
కాగా, పవన్ సినిమాల విషయానికి వస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చిన ఈయన ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్` మూవీ చేస్తున్నాడు. రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే పవన్ మరోవైపు క్రిష్ డైరెక్షన్లో `హరి హర వీరమల్లు`, హరీష్ శంకర్ డైరెక్షన్లో `భవదీయుడు భగత్ సింగ్` అనే చిత్రాలు చేస్తున్నాడు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం పవన్ చేతిలో ఉన్నాయి.