ఎన్నో అంచనాలతో సంక్రాంతి పండుగ కానుకగా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా "బంగార్రాజు". సోగ్గాడే చిన్నినాయనా కధకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించాడు అని మూవీ చూస్తుంటేనే అర్ధమైపోతుంది. ఈ సినిమాలో నాగార్జున(బంగార్రాజు)కి మనవడిగా నాగచైతన్య నటించాడు. అదే విధంగా ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి సర్పంచ్ రోల్ లో హీరోయిన్ గా అదరగొట్టేసింది.

ఇప్పటికి వరకు మనం కృతి శెట్టిని రెండు సినిమాల్లో చూశాం. మొదటి సినిమా ఉప్పెన లో సంగీత క్యారెక్టర్ లో నాన్న అంటే భయపడే అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. ఇక రెండో సినిమా నాని శ్యాం సింగరాయ్ మూవీలో ఫుల్ మోడ్రెన్ లుక్ లో దర్శనమిచ్చి..హాట్ సీన్స్ తో సెగలు పుట్టించింది. ఇక మూడో సినిమా లో మాత్రం పల్లెటూరి అమ్మాయి గా కనిపించి మరోసారి మెప్పించింది.

పల్లెటూరి అమ్మాయి అంటే సైలెంట్ గా లంగా ఓణీలు వేసుకుని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది వినే టైప్ కాదు. చదువుకుని..తాను చెప్పిందే కరెక్ట్ అంటూ ఇంట్లో గారాభంగా పెరిగి..పొగరుతో బీహేవ్ చేసే మగరాయుడు టైప్ క్యారెక్టర్ అనమాట.  
ఈ రోల్ లో కృతి ముందు రెండు సినిమాలకంటే కూడా బాగా నటించిందంటున్నారు ధియేటర్స్ లో సినిమా చూసిన జనాలు. ముఖ్యంగా ఈ సినిమాలో నాగలక్ష్మిగా నటించిన కృతి శెట్టి బంగార్రాజు మనవడితో వచ్చే సీన్స్ లో ఇరగదీసింది. లేడీ టైగర్ లా నాగచైతన్యతో మాట్లాడే మాటలు ధియేటర్స్ కు వచ్చిన జనాలను బాగా ఎంటర్ టైన్ చేసాయి.   ఫుల్ హెడ్ వెయిట్ ఉన్న నాగలక్ష్మి పాత్రలో కృతి 100 మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. ఇక ఈ బంగార్రాజు సినిమాతో అమ్మడు ముచ్చట గా మూడో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: