ఎన్నో ఆశలతో సంక్రాంతి పండుగ కానుక రిలీజైన బంగార్రాజు మూవీని చూసిన జనాలు ఇది నిజంగా పండగలాంటి సినిమానే అని చెప్పుకొస్తున్నారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సినిమాను ఎక్కడ బోర్ కొట్టకుండా సరదాగా తీసుకెళ్లిపోయాడు. ముఖ్యంగా ఈ సినిమా లో నాగచైతన్య పర్ ఫామెన్స్ అద్దిరిపోయింది అంటున్నారు సినిమా చూసిన అభిమానులు. ఫస్ట్ టైం మాస్ లుక్ లో కనిపించిన చైతన్య అభిమానుల అంచనాలను డబుల్ చేసాడనే చెప్పాలి.
ఇక ఆయన పక్కన హీరోయిన్ గా కృతి కూడా ఏం మాత్రం తగ్గకుండా నాగలక్ష్మి రోల్ లో చించేసిందని అంటున్నారు అభిమానులు . సినిమా కొంచెం స్లోగా సాగిన అక్కడక్కడ కొంచెం సస్పెన్స్ సీన్స్ పెట్టి డైరెక్టర్ బాగా కవర్ చేసాడని రివ్యూ ఇస్తున్నారు సినిమా చూసి వచ్చిన జనాలు. ఇక ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఖచ్చితంగా ఒక్కసారి అయితే సినిమాని చూడచ్చు అనేలా ఉందట ఈ బంగార్రాజు సినిమా.