స్టార్ హీరో నాగార్జున తన కెరియర్ లోనే ప్రత్యేకమైన సినిమాలలో మనం మూవీ కూడా ఒకటి. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీ లో వారందరూ కలిసి నటించడంతో ఈ సినిమా నాగార్జున కు చాలా ప్రత్యేకమని తెలియజేశారు. అయితే ఈ సినిమాని ఇతర భాషలలో సైతం రీమేక్ చేయాలని ప్రయత్నించినా అది వర్కవుట్ కాలేదని తెలియజేశారు. ఈ విషయాలన్ని బంగార్రాజు సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు నాగ్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో నే మనం సినిమా గురించి.. కొన్ని విషయాలను తెలియజేశాడు.
నాగార్జునకు పల్లెటూరి పాత్రలు అన్న, ఆ సాంప్రదాయాలు అన్నా చాలా ఇష్టమట. ఇలాంటి పాత్రల విషయంలో నాన్నగారి ప్రభావం చాలా ఉంటుందని చెప్పుకొచ్చారు నాగార్జున.పల్లెటూరి నేపథ్యంలో నాగచైతన్య నటించిన మొట్టమొదటి సినిమా బంగార్రాజు అని తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు నాన్న ప్రభావం నాపై ఉంటుందని తెలియజేశారు. తన పంచ కడితే తన తండ్రి గుర్తుకు వస్తారు అని చెప్పుకొచ్చారు నాగార్జున. ఇలాంటి పల్లెటూరి పాత్రలలో చిన్న పొగరుబోతు తనం ఉంటుందని నాగ్ తెలియజేశారు. ఇక రమ్యకృష్ణతో నేను ఏ సినిమాలో నటించిన అది గోల్డెన్ కాంబినేషన్గా మారిపోతుందని తెలియజేశాడు. ఇక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఏదైనా సీన్ బాగా లేదని తెలియజేస్తే దాన్ని మళ్ళీ తిరిగి చేంజ్ చేసుకుని వస్తాడని నాగార్జున తెలియజేశాడు.

తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అయ్యాయని.. వేరే హీరోలతో నటిస్తే ఆ సినిమాలు అంతటి స్థాయి లో సక్సెస్ అయ్యేవి కావు అని తెలియజేశారు. ఇక అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా కొంతమంది మనం సినిమా ను తీయాలని చాలా మంది ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. ఇక నాగార్జున, తన తండ్రి ,నాగచైతన్య కలిసి నటించడం వల్లే ఆ మ్యాజిక్ ఏర్పడిందని తెలియజేశారు. ఇక అంతే కాకుండా ప్రతి సంక్రాంతి తనకు స్పెషల్ అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: