అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ లో కృతి శెట్టి కి క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఇప్పటికే థియేటర్ లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోగా, ఈ ముద్దుగుమ్మ నటించిన మరో సినిమా బంగార్రాజు కూడా ఈ రోజే సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదలయ్యింది. ఈ సినిమాలతో పాటు సుధీర్ బాబు సరసన ఒక సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది,  దానితో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది, అలాగే రామ్ పోతినేని సరసన కూడా ఒక సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో కృతి శెట్టి సాంప్రదాయబద్దంగా లంగా ఓని కట్టుకొని మెడలో నక్లెస్ వేసుకొని క్లాస్ లుక్ లో డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: