సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు వస్తుంటారు, పోతుంటారు, కానీ కొంతమంది హీరోయిన్ లు మాత్రం తాము నటించిన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటారు, అలా నటించిన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో ఫారియా అబ్దుల్లా ఒకరు. 
ఈ ముద్దుగుమ్మ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కే వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, కామెడీ ప్రధాన నేపథ్యం గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించింది, జాతి రత్నాలు సినిమాతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ,  టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన బంగార్రాజు సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ లో అలరించింది,  ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక అంశాలను పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ పొడుగు కాళ్ల సుందరి అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఫారియా అబ్దుల్లా చీర కట్టుకొని క్లాస్ లుక్ లో డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  ప్రస్తుతం ఫారియా అబ్దుల్లా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: