హీరోయిన్ల సినీ కెరీర్‌ ఎప్పుడూ సస్సెన్స్ గానే ఉంటుంది. ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ కరెక్ట్ గా చెప్పలేరు. ఒక్కోసారి స్టార్‌ రేసులో ఉన్నోళ్లు ఉన్నట్టుండి పలు కారణాలతో కనిపించకుండా పోతారు. ఇక సినీ ఇండస్ట్రీలో నెగ్గుకు రాలేరు అనుకున్నోళ్లు బిజీ అయిపోతారు. అనుష్కకి ఇప్పుడు ఇలాంటి అవకాశమే వచ్చేసింది. మెగాప్రాజెక్ట్‌తో మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్‌లో హల్‌చల్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

బరువు పెరిగిన కారణంగా అనుష్క 'నిశ్శబ్ధం' తర్వాత కనిపించలేదు. బరువు పెరిగింది, మునుపటి చార్మ్‌ లేదని విమర్శలొచ్చాక కెమెరాకి దూరంగా వెళ్లిపోయింది. అయితే సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నా స్వీటీ వెయిట్‌లో మార్పులు రాలేదు. ఇంకా బొద్దుగానే కనిపిస్తోంది. దీంతో అనుష్కకి ఇంక సినిమాలు రావడం కష్టమని, కెరీర్‌ ముగిసిపోతుందనే కామెంట్స్‌ వచ్చాయి.

అనుష్క కెరీర్‌ క్లైమాక్స్‌కి చేరుకుంటోన్న సమయంలో మెగా ఆఫర్‌ వచ్చిందట. చిరంజీవితో కలిసి నటించే అవకాశం అందుకుంది స్వీటీ. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫుల్‌ స్పీడ్‌గా సినిమాలు చేస్తోన్న చిరంజీవి, ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. డి.వి.వి. దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలోనే అనుష్కని హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది.

చిరంజీవి వయసు 66 ఏళ్లు. సీనియర్‌ సిటిజన్‌ కేటగిరీలో చేరిపోయాడు. దీంతో ఏజ్, బాడీలాంగ్వేజ్‌ రెండిటికి మ్యాచ్ అయ్యే హీరోయిన్ల కోసం సీనియర్స్‌కి ఓకే చెప్తున్నాడు చిరు. ఇక ఈ లెక్కలతోనే అనుష్కకి చిరుతో కలిసి నటించే అవకాశం వచ్చిందట. మరి ఫేడవుట్‌ అనే పరిస్థితుల్లో వచ్చిన ఈ మెగా ఆఫర్‌తో స్వీటీ మళ్లీ బిజీ అవుతుందా అనేది చూడాలి.


మొత్తానికి అనుష్క మెగా ఆఫర్ కొట్టేసింది. బరువు పెరిగిన కారణంగా సినిమాలకు దూరమై.. ఇంట్లోనే ఉండిపోయిన ఈ బ్యూటీ మళ్లీ కెమెరా ముందు వస్తుందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఇన్నాళ్ల తర్వాత కనిపిస్తున్న తమ హీరోయిన్ ఎలా ఉందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: