మల్టీలింగ్వల్స్‌కి దూరంగా తెలుగు సినిమాలు చేసే నాగ చైతన్యని బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నాడు ఆమిర్ ఖాన్. 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాలో నాగచైతన్య సపోర్టింగ్‌ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ క్యారెక్టర్‌కి విజయ్‌ సేతుపతిని తీసుకున్నాడు ఆమిర్‌ ఖాన్. అయితే లాక్‌డౌన్‌లతో షూటింగ్ షెడ్యూల్స్‌ మారడంతో లాల్‌సింగ్‌ నుంచి తప్పుకున్నాడు సేతుపతి. దీంతో నాగచైతన్యని తీసుకున్నాడు ఆమిర్‌ ఖాన్.

రౌడీ హీరో విజయ్ దేవరకొండకి 'అర్జున్‌రెడ్డి' సినిమాతో హిందీలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. యాంగ్రీమెన్‌ పెర్ఫామెన్స్‌తో బాలీవుడ్‌ జనాలకి కనెక్ట్ అయ్యాడు. ఈ కనెక్షన్‌ని మరింత పెంచుకోవడానికి 'లైగర్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్‌తో అనన్యాపాండే జోడీగా నటించింది.

ఇక హీరోయిన్లూ తక్కువేం కాదు. తమ టాలెంట్ ను ఉత్తారదిన చూపించేస్తున్నారు. వరుస హిట్ లతో మంచి జోరుమీదున్న  రష్మిక మందన్న బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది రష్మిక. ఇక ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' సినిమాకి సైన్ చేసింది. వీటితోపాటు మరో ప్రాజెక్ట్‌ కూడా లైన్‌లో ఉందని ప్రకటించింది.

సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్ ఇమేజ్‌ ఉన్న నయనతార 17 ఏళ్ల కెరీర్‌లో బాలీవుడ్‌ నుంచి ఎన్ని ఆఫర్స్‌ వచ్చినా ముంబయి వెళ్లలేదు. తెలుగు, తమిళ్, మళయాళీ సినిమాలతోనే బిజీ అయింది. కానీ ఆమెకి 'రాజారాణి'తో సెకండ్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ బేస్‌ వేసిన అట్లీ అడగ్గానే హిందీకి వెళ్లడానికి ఓకే చెప్పింది. అట్లీ బాలీవుడ్‌ ఫస్ట్‌ మూవీకి సైన్ చేసింది. ఈ మూవీలో షారుక్‌ ఖాన్‌ జోడీగా నటిస్తోంది నయన్.

అమలాపాల్‌ విడాకుల తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌తో మళ్లీ బిజీ కావాలని చాలా ప్రయత్నిస్తోంది. 'ఆమె' లాంటి సినిమాల్లో బోల్డ్‌ రోల్స్‌ ప్లే చేసింది. అయితే అమలాకి మాత్రం సరైన బ్రేక్‌ రాలేదు. ఇలాంటి సమయంలో 'రంజిష్‌ హీ సహీ' అనే సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లింది. ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ పర్వీన్‌ బాబీ క్యారెక్టర్ ప్లే చేసింది. రెండేళ్ల క్రితమే అమలాపాల్‌ హిందీలో అర్జున్‌ రామ్‌పాల్‌తో ఒక మూవీకి సైన్ చేసింది. కానీ ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: