హీరో రాజశేఖర్ మాట్లాడుతూ తను నటించిన సినిమాలలో.. గరుడవేగ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది అని తెలియజేశాడు. ఆ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశాలు నాకు బాగా కుదిరాయి.. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే ఆ పాత్ర కావడం వలన.. తిరిగి జనంలోకి రీ ఎంట్రీ ఇచ్చానని రాజశేఖర్ తెలియజేశాడు. ఇక రాజశేఖర్ ప్రస్తుతం తన 91 వ సినిమా గా.. శేఖర్ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నాడు రాజశేఖర్. ఇక ఈ సినిమాని మలయాళంలో జోసెఫ్ సినిమాని తెలుగులో శేఖర్..గా రీమేక్ చేశారట.


ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా జీవిత రాజశేఖర్ నిర్వహించింది. ఇందులో తన కూతురైన శివాని కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మొత్తం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా బిజీగా ఉన్నది.. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ పలు టీవీ షోలకు, ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ. గరుడవేగ సినిమా గురించి కొన్ని అంశాలను తెలియజేయడం జరిగింది. గరుడవేగ సినిమా తన కెరియర్ కు బాగా ప్లస్ అయింది అని.. ఈ సినిమాతోనే కెరీర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని.. అందుకే గరుడవేగ నాకి ఎప్పటికీ స్పెషలే అని తెలియజేశారు.

ఇక అంతే కాకుండా ఇప్పటికే తన సన్నిహితులు, అభిమానులు కూడా ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని తెలియజేశారట, త్వరలోనే గరుడవేగ-2 చేసే అవకాశం ఉంటుందని తెలియజేశారు. దానికి తగ్గట్టుగా కథను సిద్ధం కూడా చేస్తున్నామని తెలియజేశారు. ఇక గరుడవేగ సినిమా 2017 వ సంవత్సరంలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని చేకూర్చింది డైరెక్టర్ హీరోకి.

మరింత సమాచారం తెలుసుకోండి: