నాగచైతన్య, సమంత విడిపోయాక వీళ్ల ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మళ్లీ చైసామ్‌ కాంబినేషన్‌లో సినిమా చూడగలమా, డివోర్స్‌ వీళ్ల మధ్య గోడ కట్టేస్తుందా అని ఫీలయ్యారు. అయితే చైతన్య స్టేట్మెంట్‌తో వీళ్ల ఫ్యాన్స్‌కి క్రేజీ ఎనర్జీ వస్తోంది. చైతన్య,సమంత కలిసి నటించే అవకాశముందని ఆనందపడుతున్నారు.

నాగచైతన్య, సమంత కెమిస్ట్రీకి భారీ ఫాలోయింగ్‌ ఉంది. వీళ్లిద్దరు 4 సినిమాల్లో కలిసి నటిస్తే అందులో మూడు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వీళ్ల కాంబినేషన్‌లో సినిమాలు తీసేందుకు నిర్మాతలు పోటీపడుతుంటారు. అయితే ఈ జంట విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.ఇక మీదల ఇద్దరూ కలిసి నటించకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది.

నాగచైతన్య రీసెంట్‌గా 'బంగార్రాజు' ప్రమోషన్స్‌లో విడాకుల గురించి మాట్లాడాడు. డివోర్స్ తీసుకున్నాక ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, కెరీర్‌ విషయంలో సంతృప్తిగా ఉన్నామని చెప్పాడు. పోయినేడాది అక్టోబర్‌లో ఇద్దరం విడిపోతున్నామని ప్రకటించారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి. సమంతపై విమర్శలు వచ్చాయి.

లవ్‌లో బ్రేకప్‌ తర్వాత రణ్‌బీర్ కపూర్, దీపిక పదుకొణే ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పటికీ ఫ్రెండ్స్‌లా కంటిన్యూ అవుతున్నారు. అలాగే సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ విడిపోయినా కలిసి సినిమాలు చేస్తున్నారు. మరి ఈ బ్రేకప్‌ బర్డ్స్‌లాగే నాగచైతన్య, సమంత కూడా మళ్లీ కలిసి నటిస్తారా.. వీళ్లిద్దరినీ తెరపైకి తీసుకొచ్చే దర్శకనిర్మాతలు ఎవరు అనేది చూడాలి.


మొత్తానికి నాగచైతన్య, సమంత గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అక్కినేని అభిమానులు. నిజంగా నటిస్తారా.. లేకపోతే ఇలానే స్టేట్ మెంట్ లతో సరిపుచ్చుకుంటారా అనే సందేహలు వాళ్లలో కలుగుతున్నాయి. విడాకుల తర్వాత ఇద్దరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. సమంత అయితే ఐటమ్స్ సాంగ్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగచైతన్య మాత్రం బంగార్రాజు సినిమాలో తన తండ్రితో కలిసి నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: