సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. ఇలా వచ్చిన గాసిప్స్ లలో కొన్ని నిజం అయితే కొన్ని మాత్రం కేవలం గాసిప్స్ గా మాత్రమే మిగిలిపోతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే టాలీవుడ్ లో అయితే తక్కువగా ఉంటుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోలు ఆ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాను చూపిస్తోంది . ఇక టాలీవుడ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ల మధ్య కాస్త కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అంటే వాళ్లకు సంబంధించిన న్యూస్ లే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.



 అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్ మిస్టర్ పర్ఫెక్ట్ హీరో గా కొనసాగుతున్నాడు. ఎంతో మంది హీరోయిన్లతో నటించినప్పటికీ ఏ హీరోయిన్ విషయంలో కూడా చరణ్ కు బ్యాడ్ టాక్ రాలేదు. కానీ మొదటి సినిమా సమయంలోనే చరణ్ విషయంలో ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ చిరుత అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ నేహా శర్మ హీరోయిన్ గా చరణ్ సరసన నటించింది అన్న విషయం తెలిసిందే.


 అందాలు ఆరబోస్తూ చరణ్ ను రెచ్చగొట్టే పాత్రలో నేహ శర్మ నటిస్తోంది. ఇక చిరుత సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ పాయింట్ అయిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో చరణ్ నేహా శర్మ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ అప్పట్లో ఒక టాక్ చక్కర్లు కొట్టింది  కానీ ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటూ చరణ్  క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది  మొత్తంగా అందరి హీరోయిన్ల  విషయంలో క్లీన్ చీట్ ఉన్న చరణ్  ను కూడా సోషల్ మీడియాలో అప్పట్లో వదలలేదు అన్నమాట. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు చరణ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా కరోనా వ్యాప్తి ప్రభావం పెరగడం వల్ల వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: