సంక్రాంతి పండుగ వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు తలపడుతూ ఉండేవి, ఆ సినిమాలకు బడ్జెట్ కూడా ఎక్కువగా ఉంటుంది,  కాబట్టి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగా జరుగుతుంది.  వాటి గురించి తెలుసుకోవడానికి జనాలు కూడా చూపిస్తూ ఉండేవారు, కాని ఈ సంవత్సరం బంగార్రాజు సినిమాను మినహాయిస్తే ఏ స్టార్ హీరో సినిమా కూడా  థియేటర్ ల వద్ద విడుదల కాలేదు, మరి ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు, వాటి ఫ్రీ రిలీజ్ బిజినెస్ ల గురించి తెలుసుకుందాం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా, మరో కీలకమైన పాత్రలో నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యింది, ఈ సినిమాకు 39 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ దేవ్ హీరోగా రుచిత రామ్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సూపర్ మచ్చి,  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యింది, ఈ సినిమాను ఒన్ గా రిలీజ్ చేశారు.

ఆశిష్ హీరో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా రౌడీ బాయ్స్ , ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యింది, ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు.. నైజామ్, ఆంధ్రాలో దిల్ రాజు ఈ మూవీని ఓన్ రిలీజ్ చేశారు, మిగతా ఏరియాల గాను ఈ సినిమా కు ఆరు కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

గల్లా అశోక్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా హీరో, ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు కాగా ఎనిమిది కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది, కొన్ని చోట్ల ఈ సినిమాను ఒన్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: