'బంగార్రాజు' మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో నాగచైతన్య ఇంకా కుర్ర హీరోయిన్ దక్ష నగార్కర్ చిలిపి వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇక నాగార్జున స్పీచ్ ఇస్తున్న సమయంలో మధ్యలో చైతూ వెనక్కి తిరిగి చూడగా.ఇక అక్కడే ఉన్న కుర్ర నటి దక్ష తన కనుబొమ్మలు ఎగరేసింది. వెంటనే నాగ చైతన్య సిగ్గుపడిపోయాడు. ఈ వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోపై ఎన్నో మీమ్స్ ను క్రియేట్ చేశారు మీమర్స్. రకరకాల ట్రోల్స్ ఇంకా మీమ్స్ తో చైతుని ఆహా అంటూ ఆడేసుకున్నారు. తాజాగా ఈ వీడియోపై సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్పందించారు.ఇక కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ నాగ చైతన్య స్వభావం గురించి చెప్పుకొచ్చారు. చైతులో ఉన్న క్లారిటీ మనకి కేవలం పది శాతం ఉంటే చాలు చాలా హ్యాపీగా బతికేయొచ్చు అని చెప్పారు. 

నాగ చైతన్యని అందరూ బంగారమని ఎందుకంటారో ఆయనతో పని చేశాక తెలిసిందని ఆయన అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం అతడితో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా చేశానని.. ఇప్పుడు 'బంగార్రాజు' సినిమా చేశానని.. ఈ నాలుగేళ్లలో అతడిలో ఎన్నో మార్పులొచ్చాయని.. మాట్లాడే పద్ధతి ఇంకా నటన అలాగే మెచ్యూరిటీలో మార్పులొచ్చాయని ఆయన చెప్పారు.చైతు చాలా సైలెంట్ అని అనిపిస్తుందని.. కానీ ఆయన అంత సైలెంట్ కాదని అన్నారు. ఇక నాగార్జున గారు మాట్లాడుతున్న సమయంలో ఏదో సౌండ్ అయిందని చైతు వెనక్కి తిరిగిచూశాడని ఇక అలా వెనక్కి తిరగడంతో దక్ష కళ్లు ఎగరేసిందని దాంతో నాగచైతన్య సిగ్గుపడ్డాడని చెప్పుకొచ్చారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఆయన అలా సిగ్గుపడడం కామన్ అని ఆయన్ని ఎవరిని చూసినా కాని అలానే నవ్వుతాడని.. అదంతా ఓన్లీ ఆమె వల్లే జరిగిందంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్ యూ సినిమా చెయ్యబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: