గ్లోబల్ ఐకాన్ హీరోయిన్ గా పేరు పొందింది ప్రియాంక చోప్రా.. ప్రియాంక చోప్రా సినిమా వార్తల కంటే తన పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.. తాజాగా కొద్దిరోజుల నుంచి విడాకులు వ్యవహారంపై వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు ఆమె ఒక బేబీ ప్లానింగ్ గురించి.. మరొకసారి నిక్ జోనాస్ తో ఉన్న రిలేషన్ గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటోంది. అయితే ఈ విషయంపై తరచుగా వీరిద్దరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు అభిమానులు. నెటిజన్లు.. ప్రియాంక చోప్రా కూడా వీరికి ధీటుగానే సమాధానాలు ఇవ్వడం జరిగిందట. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

ప్రియాంక చోప్రా ఒక పాపులర్ సింగర్ నిక్ జోనాస్ వివాహం చేసుకుంది. అలా కొద్ది రోజుల తర్వాత తన ఇంస్టాగ్రామ్ లో తన పేరు ముందు ఉన్న..జోనాస్ అనే పేరుని తొలగించింది.. దీంతో ఆమె అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని ఊహాగానాలు కూడా వెలుబడ్డాయి. అయితే ఈ విషయంపై ప్రియాంక స్పందిస్తూ.. అలా పేరు మార్చడం కేవలం వృత్తి పరమైన నిర్ణయం కాబట్టి అలా చేశామని తెలియజేసింది. సోషల్ మీడియా లో ఏదైనా ఒక పోస్ట్ చేశాను అంటే ప్రజలు దానిని జూమ్ చేసి మరి మాట్లాడుతున్నారని తెలియజేసింది. ఇక సోషల్ మీడియాని బాగా అందరూ ఉపయోగిస్తున్నారు కాబట్టే ఎటువంటి విషయమైన తొందరగా స్ప్రెడ్ అవుతోందని తెలియజేసింది.

ఇది మాత్రమే కాకుండా.. తన భర్తకి పిల్లలంటే ఇష్టం.. అందుచేతనే తామిద్దరం ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కూడా మాట్లాడుకున్నామని తెలియజేసింది. ఆ భగవంతుడి దయతో అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది తెలియజేసింది.. మా ఇద్దరికీ కలిపి ఒక పిల్లవాడు జన్మిస్తే అప్పుడు మా బిజీ లైఫ్ నుండి మేము విరామం తీసుకుంటామని తెలియజేసింది. ఇక అంతే కాకుండా భవిష్యత్తులో మా కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి ఎదురుచూస్తున్నామని తెలుపుకు వచ్చింది ప్రియాంక చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: