బుల్లితెరపై బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో గా కొనసాగుతుంది బిగ్బాస్ కార్యక్రమం. ఇక ఈ బిగ్బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సినీ సెలబ్రిటీలుగా కూడా ఎంతగానో పాపులర్ అవుతున్నారు. అయితే కేవలం ఒక్క భాషలో మాత్రమే కాదు దాదాపు తెలుగు తమిళం హిందీ భాషలలో బిగ్బాస్ కార్యక్రమం ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తోంది అన్నది అందరికీ తెలిసిందే. సినీ సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికి బిగ్బాస్ కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రేక్షకులు. అంతేకాకుండా ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ లకు ఓట్లు వేసి ఒక రకంగా ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో భాగం అయిపోతున్నారు అనే చెప్పాలి.


 ఇదిలా ఉంటే ఒక్కసారి బిగ్బాస్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారూ అంతే చాలు ఇక బయటకు వచ్చిన తర్వాత ఎంత క్రేజ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు భారీ ఆఫర్లు అందుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా గట్టిగా లక్కు కుదిరింది అంటే ఏకంగా స్టార్ హీరోల సరసన   ఛాన్స్ కొట్టేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అవకాశాన్ని కొట్టేసింది బిగ్ బాస్ బ్యూటీ శివాని నారాయన్. తమిళ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెర నుంచి వెండితెర వరకు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు సత్తా చాటుతోంది.



 ఇక ఇప్పుడు అదిరిపోయే అవకాశాన్ని దక్కించుకుంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విక్రమ్ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక విజయ్ సేతుపతి సరసన శివాని నారాయణ ఛాన్స్ కొట్టేసింది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు పొన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా అవకాశం దక్కించుకుందట ఈ ముద్దుగుమ్మ.విజయ్ సేతుపతి హీరోగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూండగా.. ఈ సినిమాలో శివానీ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందట. ఇక దీనికి సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో  వైరల్ గా మారిపోయింది. అయితే విజయ్ సేతుపతిసరసన హీరోయిన్గా నటిస్తోందా లేదా ఏదైనా కీలక పాత్రలో నటిస్తుందా  అన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: