ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా కొనసాగుతుంది నయనతార.. సీనియర్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు అందరికీ పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంటు దూసుకుపోతోంది. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లో గ్లామర్ పాత్రలో నటించి తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంది. అప్పట్లో తన గ్లామర్ డోస్ తో అందరికీ పిచ్చెక్కించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన నటనతో అందరిని మైమరిపిస్తుంది. ఒకప్పుడు పొట్టి పొట్టి డ్రెస్సుల్లో గ్లామర్ షో చేసిన నయనతార ఇక ఇప్పుడు మాత్రం సాంప్రదాయమైన వస్త్రధారణ లోనే సినిమాల్లో కనిపిస్తూ ఎంతోమందిని అభిమానులను సంపాదించుకుంది.


 వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతుంది. దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీస్ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార. ఇక వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోయిన్లు అటు సినిమాల్లో అద్భుతంగా రాణిస్తూ ఉండడమే కాదు బిజినెస్ లో కూడా అడుగుపెడుతూ రాణిస్తున్నారు. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న విధంగా మల్లు మంచి ఆఫర్లు వస్తున్నప్పుడే ఇక ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలోకి అడుగు పెడుతూ ఉండటం గమనార్హం.



 ఇక ఇప్పుడు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా బిజినెస్ లో దుమ్మురేపుతోంది  ఇక ఇప్పుడు ఇటీవలే కొత్త బిజినెస్ లో నయనతార ఇన్వెస్ట్మెంట్ చేసింది అన్న పుకారు షికారు చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఏకంగా దుబాయ్కి చెందిన ఒక ఆయిల్ కంపెనీలో పెట్టుబడి పెట్టిందట ఈ ముద్దుగుమ్మ. ఏకంగా వంద కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్లు ఒక టాక్ ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ విషయం తెలిసి వామ్మో నయన్ వ్యాపారంలో  కూడా దూసుకుపోతుంది అని అనుకుంటున్నారు అభిమానులు. ఇక ఇప్పటికే నయనతార విగ్నేష్ శివన్ తో కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇక  చాయ్ వాలే, లిప్ బామ్ లాంటి బ్రాండ్లలో ను వీరిద్దరూ పెట్టుబడులు పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: