తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో వివాహ బంధం నుంచి దూరమైన తర్వాత సినిమాల్లో వేగాన్ని పెంచిన విషయం అందరికి తెలిసిన విదితమే. ఆమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సమంత బిజీగా మారిపోయింది. సమంత ఇటీవల విడుదలైన పుష్పలో స్పెషల్ సాంగ్‌తో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది.

గుణశేఖర్ దర్శకత్వంలో ఇప్పటికే  శాకుంతలం సినిమాను పూర్తి చేసిన సమంత.. తాజాగా యశోద అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఇక ఈ రెండు సినిమాలు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. సమంత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే దిశగా అడుగులుఈ వేస్తుంది ఈ భామ.

ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సామ్ మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకుందని నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత నటిస్తున్నారని అనే వార్త కనిపిస్తుంది. ఈ మూవీని త్రివిక్రమ్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కించనున్నారని, ఓ నవల ఆధారంగా ఈ సినిమా కథ ఉండనుందని వార్తలు వినపడుతున్నాయి. అంతేకాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను టేకాఫ్ చేయడానికి ఓ కారణం ఉందని నెటిజన్స్ అనుకుంటున్నారు.

ఇంతకీ అదేంటంటే.. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం ఏ సినిమా కూడా లేదంటా. అయితే వాస్తవానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్‌తో సినిమా చేయాల్సి ఉండగా, కాగా.. సర్కారు వారి పాట విడుదలయ్యే వరకు మహేష్ డేట్స్ దొరికే అవకాశాలు లేనట్లు కనిపిస్తుంది. దాంతో ఈ గ్యాప్‌లో సమంతతో ఒక సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: