అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా  ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది,  వీటితో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్టులలో కూడా రాశి ఖన్నా నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటే ఈ హాట్ బ్యూటీ కొంతకాలం క్రితం కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో రాశి ఖన్నా అదిరిపోయే లుక్ లో హాట్ ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది, ఇప్పటికి కూడా హాట్ బ్యూటీ రాశి ఖన్నా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: