మన హీరోలు ఎక్కువగా సంక్రాంతి సీజన్ లోనే తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు ఏర్పాట్లూ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సంక్రాంతి సీజన్ సంవత్సరం పొడుగునా వచ్చే పండుగలలో అతి పెద్ద పండుగ సీజన్. ఈ సీజన్ లో సినిమా వస్తే తప్పకుండా ఓ వారం రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది హీరోలు తమ సినిమాలను ఎప్పుడు మొదలు పెట్టినా కూడా సంక్రాంతికి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. 

ఈ పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించి భారీ వసూళ్లను కొల్లగొడుతూ ఉంటారు. ఆ విధంగా సంక్రాంతి సీజన్ పై మన హీరోలు ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సంక్రాంతి సీజన్ లో కొన్ని మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చాయి భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించి మంచి వసూళ్లను రాబట్టి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

అయితే గత సంక్రాంతి సీజన్ తో పోలిస్తే ఈ సంక్రాంతి సీజన్ లో పెద్దగా ఆశాజనకమైన సినిమాలేవి విడుదల కాలేదనే చెప్పాలి. వాస్తవానికి ఈ సీజన్ లో రెండు చిత్రాలు విడుదల చేయాలని భావించి విడుదల తేదీలను కూడా నిర్ణయం చేశారు. కానీ అనూహ్యంగా ఆ రెండు భారీ చిత్రాలు కూడా పోస్ట్పోన్ కావడంతో ఈ సంక్రాంతి సీజన్ కు చిన్న సినిమాల హవా ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే ఉన్నదాంట్లో మంచి సినిమాగా అందరూ భావిస్తున్న సినిమా బంగార్రాజు చిత్రానికి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించడానికి కారణం ఇదే పెద్ద సినిమా కావడం. ఏదేమైనా ముందు నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తన సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా నాగార్జున కు అదే ఇప్పుడు బాగా కలిసి వచ్చి ఇంతటి విజయం సాధించడానికి కారణం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: