సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా పరిశ్రమలోనే ఎప్పుడు లేని సంక్రాంతి సీజన్ కంటే అత్యంత దారుణమైన సాదాసీదా సంక్రాంతిగా ముగుస్తుంది అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ సంక్రాంతి సీజన్ ప్రేక్షకులకు మరిచిపోని విధంగా చేయాలని టాలీవుడ్ భారీ భారీ ప్రణాళికలు వేసింది. రెండు భారీ సినిమాలను విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎక్కువ వినోదం ఆనందింప చేయాలని చెప్పి అంతా సిద్ధం చేయగా కరోనా మరొకసారి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు భారీ దెబ్బ వేసింది.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సర్వం సిద్ధం చేసింది టాలీవుడ్. దానికి తగ్గ ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ భారీ గా చేసింది. భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించిన తరువాత విడుదల నాలుగు రోజులు ఉన్న సమయంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది. ఇది ప్రేక్షకులను ఎంతో నిరాశ పరిచింది అని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఇతర భాషలలో 100% థియేటర్లు ఓపెన్ లేకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. 

ఒక సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత మరొక సినిమా కూడా భయపడి ఆ సినిమా వెళ్ళిన బాటలోనే వెళ్ళింది. ఆర్.ఆర్.ఆర్ బాటలోనే ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం వాయిదా పడింది. జనవరి 14వ తేదిన విడుదల కావడానికి సర్వం సిద్దం చేసుకోగా కరోనా కారణంతో ఈ సినిమా కూడా విడుదల వాయిదా వేసుకుంది. ఈ రెండు సినిమాల గైర్హాజరీ తో కొన్ని చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చి ప్రేక్షకులను అలరించి భారీ వసూళ్లను సాధించాలనే ప్రయత్నం చేసింది. అలా ఇప్పుడు వచ్చిన చిన్న సినిమాలే ప్రేక్షకులకు దిక్కు అయ్యాయి. ఏదేమైనా ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేద్దాం అనుకుని సంక్రాంతి సీజన్లో ని సినిమాల కోసం ఎదురు చూడగా ఇప్పుడు సడన్ గా ఆ సినిమాలు అన్నీ పోస్ట్పోన్ కావడం వారినీ తీవ్రమైన నిరాశ లోకి తీసుకు వెళ్ళాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: