ఇప్పుడిప్పుడే సౌత్ సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం జరుగుతున్నాయి. మొదటి నుంచి మధ్య ఎలాంటి ఈగోలు లేకుండా హీరోలు అందరూ కలిసి సినిమాలు చేయడం కేవలం ఉత్తరాదిన మాత్రమే జరిగేది. సౌత్ లో అస్సలు హీరోల మల్టీ స్టారర్ సినిమా లు వచ్చేవి కావు. ఎప్పుడో ఒక సినిమా అలా వచ్చేది. ఇక్కడ ఏ హీరోకి ఆ హీరోనే తోపు. మంచి క్రేజ్ కలిగి ఉండటంతో వారు సోలో సినిమాలను చేయడానికి ఎక్కువగా మక్కువ చూపేవారు. అయితే ఈ 21 వ దశాబ్దంలో దక్షిణాది హీరోలలో కూడా కొంత మార్పు వచ్చినట్లు వారు ఇప్పుడు చేసే సినిమాల బట్టి తెలుస్తుంది.

గతంలో కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపేవారు మన హీరోలు. సుమోలు ఎగరడం, ఒక దెబ్బకు పదిమంది కింద పడడం, రొమాన్స్ లు, ముద్దులు, కౌగిలింతలు వంటివి ఎక్కువగా ఉండే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు.  కానీ ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలలో సైతం మన సౌత్ హీరోలు నటించడం మొదలు పెట్టారు. అలా మల్టీస్టారర్ సినిమాలను సైతం తెరకెక్కిస్తున్నారు వీరు. అయితే తమిళ తెలుగు సినిమాలను కలిపి ఇరు హీరో లను కలిపి సినిమాలు చేయడం మాత్రం జరగడం లేదు.

ఇండస్ట్రీలోని హీరోలు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలతో దర్శకులతో సినిమాలు చేయడం ఇప్పటి వరకు జరిగింది ఇప్పుడు కొంతమంది తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. కానీ ఇరు ఇండస్ట్రీ ల హీరోలను కలిపి సినిమా లు చేసే దర్శకులు ముందుకు రాకపోవడం సౌత్ సినిమా అభిమానులను ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  ఇండస్ట్రీలో బయట హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదా కథ లు లేవా అనేది తెలియదు కానీ  దీనికి కారణం ఏదైనా కూడా ఆ విధంగా సినిమాలు వస్తే ఇంకా బాగుంటుంది అనేది సౌత్ సినిమా అభిమానుల మాట. ఇప్పుడిప్పుడే ఇతర భాషలు దర్శకులు ఇతర భాషలలోనీ హీరోలతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఇది తొందర్లోనే సాధ్యపడుతుంది అని అనుకోవాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: