అక్కినేని నాగార్జున హీరోగా బంగార్రాజు చిత్రం తెరకెక్కి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద సినిమాల గైర్హాజరీ తో తెలుగులో సంక్రాంతి కి వచ్చే భారీ క్రేజ్ ఉన్న భారీ స్టార్స్ ఉన్న ఏకైక చిత్రం ఇదే కావడంతో ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. మొదటి నుంచి ఈ చిత్రం యొక్క హీరో అయిన అక్కినేని నాగార్జున ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు.

దానికి తగ్గట్లుగానే ఆయన అన్ని అంశాలు కూడా కలిసి రాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ వసూళ్లు సాధించిన సినిమాగా మిగిలిపోయింది అని చెప్పవచ్చు. సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తుండటం ఈ సినిమా పట్ల యువతలో కూడా మంచి క్రేజ్ నెలకొనడానికి ముఖ్యకారణం. సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ గా ఈ చిత్రం మొదటి నుంచి భారీ స్థాయిలో తెరకేక్కుతూ వచ్చింది. 

కేవలం మూడు నెలల సమయంలో ఈ సినిమా తెరకెక్కింది అంటే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఎంతలా నిశ్చయించుకున్నారు అర్థం అవుతుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత అక్కినేని నాగార్జున గెస్ట్ పాత్రలోనే పరిమితమై పోయినట్లుగా చూసిన ప్రేక్షకులు తేల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు కోసం ఇంత రిస్క్ చేయడం అవసరమా అని నాగార్జున ను విమర్శిస్తున్నారు సినీ విశ్లేషకులు. అక్కినేని అభిమానులు అయితే ఆయన సినిమా హిట్ చేయడం కోసం ఇంత క్రేజ్ ఉన్న నాగార్జున ఇలాంటి పాత్ర చేయడం అవసరం లేదు. ఆ పాత్రకు ఎవరైనా నటుడి ని పెడితే బాగుండేది అని కూడా అంటున్నారు. ఏదేమైనా నాగార్జున ఎంతో నమ్మి చైతన్యకు హిట్ ఇవ్వాలనే నమ్మకంతో ఈ సినిమాను చేసి ఇప్పుడు దానిలో సఫలీకృతం అయ్యాడని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: