బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.మామూలుగా కాదు ఆశించిన దాని క‌న్నా ఎక్కువే హిట్ కొట్టాడు.క‌రోనా స‌మ‌యంలో ఎన్నో అవ‌రోధాలు దాటి అత్యంత ఆస‌క్తితో ఎదురు చూస్తున్న అభిమానుల‌ను ప‌ల‌క‌రించి మ‌రోసారి బంగార్రాజుగా నాగ్ చేసిన సంద‌డి ఆయ‌న కుమారుడు చై చేసిన సంద‌డి అదిరిపోయింద‌ని అంతా అంటున్నారు.ఇంకేం నాగ్ కూడా చాలా అంటే చాలా న‌మ్మ‌కంతో ఈ సినిమా విష‌య‌మై ఉన్నారు.అవ‌న్నీ ఇప్పుడు నిజం కావ‌డంతో నాగ్ అండ్ నాగ్ చైత‌న్య ఇద్ద‌రూ మ‌రింత క‌సితో క‌లిసి పనిచేయాల‌న్న త‌లంపులో ఉన్నారిప్పుడు.రానున్న కాలంలో ఇలాంటి ప‌ల్లె నేప‌థ్యం ఉన్న క‌థ‌లు మ‌రిన్ని రావ‌డం కూడా ఖాయం. ఇవాళ పండుగ రారాజు బంగార్రాజు! నౌ డౌట్ ఇన్ ఇట్ !

సోగ్గాడే చిన్నినాయ‌న‌కు కొన‌సాగింపుగా పండ‌గ‌కు బంగార్రాజును తీసుకువ‌చ్చారు నాగ్.సినిమా అనుకున్నంత‌గానే బాగానే వ‌చ్చింద‌ని,ఇంకాస్త దృష్టి పెడితే క‌థ‌నం ఇంకా బాగుండేద‌ని కొంద‌రు రివ్యూయ‌ర్లు చెబుతున్నారు.వాళ్ల మాటెలా ఉన్నా ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా క‌న్నుల పంట.ఇద్ద‌రు అక్కినేని హీరోలు అందునా తండ్రీ కొడుకులు చిల‌క కట్టులో అద‌ర‌గొట్టారు అని వీళ్లంతా ఫిదా అయిపోతున్నారు.తాము ప‌డిన క‌ష్టం,ముఖ్యంగా ఎడిట‌ర్ విజ‌య్ కష్టం,అనూప్ చేసిన సంగీతం,వాటి ప‌రంగా బృందం ప‌డిన శ్ర‌మ ఇవ‌న్నీ గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ నాగ్ భ‌లే పొంగిపోతున్నారు.ఎన్న‌డూ లేనిది ఆయ‌నలో ఓ గొప్ప కాన్ఫిడెన్స్ తొణికిస‌లాడుతోంది.నాన్న ఏఎన్నార్ చేసిన లాంటి పాత్ర‌లు చేయ‌డం ఆయ‌న‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న కోరిక.ఈ సినిమా ఆ కోరిక‌ను మ‌రోసారి తీర్చ‌డ‌మే కాదు ఆయ‌న‌ను మ‌ళ్లీ న‌వ మ‌న్మ‌థుడ్ని చేసి అంద‌మ‌యిన భామ‌ల‌తో ఆడిపాడేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది.

ఈ నేప‌థ్యంలో..ఈ త‌రుణంలో..బంగార్రాజు స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు.సినిమాను విజ‌య‌వంతం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నాగ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.అంతేకాదు త‌న సాంకేతిక నిపుణుల‌తో కూడుకుని ఈ స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు.వాళ్లంతా త‌మ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.పండ‌గ‌కు పండ‌గ‌లాంటి సినిమా అని ముందు నుంచి చెబుతున్న తీరుగానే బంగార్రాజు మంచి క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తుండ‌డం త‌మ‌కు ఆనందంగా ఉంద‌ని అన్నారు నాగ్. ప్యాండ‌మిక్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాను తీశార‌ని చూసిన ప్రేక్ష‌కులు చెబుతూ ఉంటే త‌మ‌కు మ‌రింత సంతోషంగా ఉంద‌ని చెబుతున్నారు నాగ్.  మొద‌ట్రోజు క‌లెక్ష‌న్  గ్రాస్ 17 కోట్ల రూపాయ‌లకు పైగా అని తేలింది. ఇంకా ఈ వివ‌రంపై ఆఫీషియ‌ల్ అప్డేట్ అయితే రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: