ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన పుష్ప‌ డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్క‌డ విన్నా పుష్ప సినిమా పాట‌లే వినిపిస్తున్నాయి. ఎక్క‌డ చూసినా పుష్ప గురించిన డైలాగ్ త‌గ్గేదేలే.. ఎయ్‌బిడ్డా.. ఇది నా అడ్డా వంటి డైలాగ్‌ల‌ను తరుచూ ప‌లువురు ఏదో ఒక సంద‌ర్భంలో మాట్లాడుకూనే ఉంటున్నారు. మ‌రొక వైపు సుకుమార్‌, అల్లుఅర్జున్ కాంబినేష‌న్ లో ఇది హ్యాట్రిక్ చిత్రం కావ‌డం విశేషం. పుష్ప సినిమా భారీ విజ‌య‌మే కాదు.. రికార్డుస్థాయి క‌లెక్ష‌న్ల‌ను కూడా వ‌సూలు చేసింది.

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో కొన‌సాగిన ఈ చిత్రంలో బ‌న్నీ స్మ‌గ్ల‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. పుష్ప రాజ్ పాత్ర‌లో అల్లుఅర్జున్‌ క‌న‌బ‌రిచిన న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.  ఈ  ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు, సినిమా తార‌లు ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే తాజాగా కోలీవుడ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ పుష్ప సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లే కురిపించాడు.
 
నెల్స‌న్ దిలీప్ ప్ర‌స్తుతం విజ‌య్ ద‌ళ‌ప‌తి తో బీస్ట్ సినిమాను తెర‌కెక్కిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. పుష్ప సినిమా పై ఆయ‌న స్పందిస్తూ.. ఈ విధంగా అన్నారు. ఇలాంటి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సొంతం చేసుకోవ‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అల్లుఅర్జున్ అద్భుతంగా న‌టించార‌ని..  డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ ట్వీట్ చేసారు.   ఈ ట్వీట్‌పై ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చాలా థాంక్యూ నెల్స‌న్ సారూ అని రిప్లై ఇచ్చారు.

స్పెష‌ల్‌గా బ‌న్నీ సార్ మీకు నా న‌ట‌న న‌చ్చ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ డాక్ట‌ర్ సినిమా చాలా బాగుంది అని.. ఈ మ‌ధ్య కాలంలో నాకు న‌చ్చిన సినిమా మీ డాక్ట‌ర్ అంటూ అల్లుఅర్జున్ నెల్స‌న్ అని ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. మ‌రొక వైపు పుష్ప సినిమా రెండు పార్టులుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో పార్ట్‌-2 షూటింగ్ మొద‌లు పెట్టనున్న‌ది సుకుమార్ టీమ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: