గత సంవత్సరం లవ్ స్టోరీ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో నాగచైతన్య.. ఇప్పుడు తాజాగా బంగార్రాజు మూవీ తో మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.. ఇదే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సంక్రాంతికి తండ్రీకొడుకులదే హవా అని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ఇక అన్ని ఏరియాల నుంచి బంగార్రాజు మూవీ పై మంచి రెస్పాన్స్ లభిస్తుండటంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక అంతే కాకుండా చైతూ కూడా ఈ సినిమాపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఈ విషయాలని బాలీవుడ్ మీడియాతో పంచుకున్నారు చైతూ. తాత, తండ్రి చేసే ఏ పనైనా స్పాట్లో చేయలేనని నాగ చైతన్య తెలియజేశాడు.

తన తండ్రి బిగ్ బాస్ లో చేసే విధానాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని తెలియజేశారు నాగ చైతన్య. ఆయన లాగ నేనెప్పుడూ చేయలేనని తెలియజేశారు.ఇక అంతేకాకుండా సమంత గురించి మాట్లాడడం జరిగింది. గత సంవత్సరమే చైతన్య -  సమంత విడాకులు తీసుకున్నారు. అందరం కలిసి మంచి నిర్ణయాన్ని తీసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని తెలియజేశారు చైతన్య. అయితే చైతన్యకు ఆ వెంటనే ఒక ప్రశ్న ఎదురైంది.. మీరు ఇప్పటి వరకు నటించిన హీరోయిన్లలో.. మీకు బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగా కుదిరింది అనే ప్రశ్న ఎదురుకాగా.. నాగచైతన్య తడపడుకోకుండా సమంత పేరు చెప్పి అక్కడున్న వారందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు బాగా పాపులర్ గా మారాయి.


అంతేకాకుండా అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా అనే సినిమా లో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను మరిచిపోలేను అని తెలియజేశారు. అమీర్ ఖాన్ కూడా షూటింగ్ సమయంలో అక్కడ ఉండే వారందరితో బాగా కలిసి పోతారని తెలియజేశాడు చైతన్య. అంతేకాకుండా తామిద్దరం మంచి స్నేహితులం అని కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: