నాగచైతన్య తాజాగా కోలీవుడ్ హీరో కార్తీ ట్వీట్ కి రిప్లై ఇవ్వడం జరిగింది. మొన్నామధ్య కోలీవుడ్ హీరో కార్తీ.. నాగ చైతన్య, నాగార్జున కలిసి నటించిన చిత్రం బంగార్రాజు.. ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని థియేటర్లలో చాలా ఘనంగా నిన్న అనగా జనవరి 14 వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటి షో తోనే మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదల అవ్వక ముందు సంక్రాంతి పండుగకు రాబోతున్న ఈ అద్భుతమైన సినిమాను చూడడానికి ఎదురుచూస్తున్నాము నాగార్జున అన్నయ్య.. ఇక మిమ్మల్ని ఒకే తెరపై థియేటర్లలో చూడడానికి ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.. మా అందరి అభిమానాలు, ప్రేమ, గౌరవం మీకు ఎల్లప్పుడూ ఉంటాయని కార్తీ ట్వీట్ చేశాడు..


ఇక ఈ ట్వీట్ ను ఉద్దేశించి నాగార్జున తాజాగా రీట్వీట్ చేయడం జరిగింది.. ఇక నాగార్జున తన ట్విట్టర్ ద్వారా ఇలా ట్వీట్ చేయడం జరిగింది.. ధన్యవాదాలు ప్రియమైన సోదరుడా.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు నాగార్జున. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.. ఇకపోతే నాగార్జున  , కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాలో శ్రీయ , తమన్నా కూడా హీరోయిన్లుగా నటించారు. వీరు నలుగురి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే బంగార్రాజు సినిమాకు ఈ సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాలేవీ పోటీ లేకపోవడంతో కలెక్షన్ల పరంగా బాగానే సునామీ సృష్టిస్తోంది అని చెప్పవచ్చు. ఇక చిన్న చిన్న సినిమాలను పక్కన పెడితే బంగార్రాజు సినిమా  స్టార్ హీరోల సినిమా కాబట్టి ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా నాగ చైతన్య , నాగార్జున మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో ఈ సంక్రాంతి సందర్భంగా వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: