ఇటీవల కాలంలో ఎవరి నోట విన్నా కూడా పుష్ప సినిమా పేరే ఎక్కువగా వినబడుతుంది. సరైన సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేసి భారీ ఫాలోయింగ్ భారీ వసూళ్లను సాధించుకున్న చిత్రబృందం ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి చేరవేయడంలో సఫలీకృతం అయిందని చెప్పవచ్చు. ప్రతి హీరో కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఈ స్థాయిలో అడుగు పెట్టాలని భావిస్తాడు. అలా ఆ స్థాయిని అందుకున్నాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా మార్కెట్లోకి ఈ లెవల్లో అడుగుపెడతానని కలలో కూడా ఊహించలేదు అల్లు అర్జున్.

సినిమా విడుదలకు ముందు చిత్రంపై భారీ స్థాయిలో నెగిటివిటీ ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఈ చిత్రాన్ని ఇంతటి స్థాయిలో విజయం అందుకునేలా చేశాడు అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. చాలా తక్కువ మేటర్ ఉందని మొదట్లో సినీమా చాలా విమర్శలు వచ్చాయి. ఆయన కూడా యూనిట్ దేన్నీ పట్టించుకోకుండా బాగా ప్రమోట్ చేస్తూ వచ్చింది చిత్రబృందం. దాని ఫలితంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. తెలుగునాట పుష్ప సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా తమ అభిమాన హీరో పాన్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఇలాంటి సాలిడ్ హిట్ కావాలని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. 

పుష్ప లాంటి హిట్ సాధించే సినిమా చేయాలనీ వారు సూచిస్తున్నారు. అందుకే ఇప్పుడు కొరటాల శివ తో ఆయన చేయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని  దేశ స్థాయి ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమా రూపొందించాలని సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. షూటింగ్ దశలో కి వెళ్ళనుంది. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందిస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు ఎన్టిఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: