టాలీవుడ్లో 'పాగల్' చిత్రంతో గతేడాది పలకరించాడు యంగ్ హీరో విశ్వక్ సేన్..ఇక ఈ ఏడాది మరో డిఫరెంట్ కథతో సిద్ధమై మళ్ళీ  రాబోతున్నాడు. అయితే విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా  'అశోకవనంలో అర్జున కళ్యాణం'.ఇకపోతే ఈ సినిమాని  బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు - సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇప్పటికే విశ్వక్సేన్ హీరో గా నటించిన ఈ సినిమా కి సంబంధించిన పోస్టర్లు విడుదల కావడం జరిగింది. ఇక దీనిని చూసిన ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా లో విశ్వక్ సీన్.. నెలకు 70 వేల జీతం సంపాదిస్తాడు... తనకి 34 ఏళ్ళు దాటిపోయినా కూడా పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక  మీకెవరికైనా పెళ్లి కూతురు దొరికితే చెప్పండి అంటూ పోస్ట్ పెట్టిన అల్లం అర్జున్ కి పెళ్లికూతురు దొరికేసింది. అయితే ఈ సంక్రాంతి నాడు తనకి కాబోయే భార్యను పరిచయం చేసి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకంక్షలు తెలిపాడు విశ్వక్సేన్.ఇకపోతే అల్లంగారి పెళ్లి కూతురు అంటూ విశ్వక్సేన్ హీరోయిన్ ని మేకర్స్ ఒక వీడియో ద్వారా పరిచయం చేశారు. ఇక పలుపులేటి మాధవి గా రుక్సార్ థిల్లర్ ఇందులో కనిపించనుంది.  

అయితే ఈ బ్యూటీ కృష్ణార్జున యుద్ధం మరియు ఎబిసిడి చిత్రాలలో నటించి.. మెప్పించి ప్రస్తుతం 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రంలో విశ్వక్ సరసన నటించనుంది. ఇక ఈ సీన్ లో రొమాన్స్ తో అదరగొట్టేసారు వీరిద్దరు.ఇక వీడియోలో వీరిద్దరి మధ్య రొమాన్స్ చూస్తుంటే సినిమాలో కూడా మంచి రొమాన్స్ ని చూపిస్తున్నట్లు తెలుస్తుంది... అంతేకాకుండా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. త్వరలోనే విడుదల కూడా కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: