ప్రపంచంలో ఆడవాళ్లు అనేవాళ్ళు లేకపోతే ఏడుపులు ఉండవనే భావన చాలా తప్పని ఆడవాళ్లు ఎప్పుడూ కూడా ఏడవకూడదని ప్రముఖ దర్శకులు అయిన పూరి జగన్నాథ్‌ అన్నారు. తాజాగా ఆయన పూరి మ్యూజింగ్స్‌ వేదికగా ఆడవాళ్లు ఏడవద్దు అనే భావనతో బాబ్‌ మార్లే పాడిన పాటకు అసలైన అర్థాన్ని ఆయన వివరించారు. అస్సలు ఆయన ఎం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం..

‘‘పటాయ్‌లో బీచ్‌ ఒడ్డున రెస్టారెంట్‌లో నేను కూర్చున్నప్పుడు, ఒక వ్యక్తి బాబ్‌ మార్లే పాటలు పాడుతూ ఉన్నాడు. రెండు పాటల తర్వాత అతను ‘నో విమెన్ నో క్రై’ అనే పాటను కూడా పాడటం మొదలుపెట్టాడు. ఆ పాట వింటూనే రెస్టారెంట్‌లోని మగవాళ్లంతా కూడా అరుపులు అలాగే విజిల్స్‌ వేయడం ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్‌లోని ఆడవాళ్లంతా కూడా మొహాలు చిన్నబుచ్చుకుని కూర్చున్నారట.సింగర్‌ ‘నో విమెన్ నో క్రై’ అన్నప్పుడల్లా రెస్టారెంట్‌లోని మగాళ్లు అతడితో గొంతు కలిపి మరి అంతకంటే పెద్దగా ‘నో విమెన్‌ నో క్రై’ అనడం ప్రారంభించారట.. కానీ ఈ పాట అసలు భావం ‘నో విమెన్‌ నో క్రై’ కాదు, ‘నో విమెన్‌ న క్రై’. అంటే ఆడవాళ్లు అస్సలు ఏడవద్దు అని అర్థం. చాలా మంది ఈ పాట బాబ్‌ మార్లే రాశాడని అనుకుంటారు.నిజానికి ఈ పాట రాసింది మాత్రం విన్సెంట్ ఫోర్డ్‌. విన్సెంట్ ఫోర్ట్‌ రాసిన ఈ లిరిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాబ్‌ మార్లే ఈ పాట పాడాడని’’ఆయన చెప్పారు.

‘‘ట్రెంచ్‌ టౌన్‌లో ఒక బిడ్డను పోలీసులు కొడుతుంటే ఆ ఏడుపు నాకు బాగా వినిపిస్తుంది.ట్రెంచ్‌ టౌన్‌లో ప్రభుత్వ స్థలంలో కూర్చున్నప్పుడు మంచి వ్యక్తులను మరియు స్నేహితులను కలవడం అలాగే రాత్రులు దీపాలు వెలిగించడం అదే విధంగా కార్న్‌ మీల్‌తో పూరిట్జ్‌ వండుకోవడం నాకు బాగా గుర్తుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయాల వల్ల అలాంటి ఆహ్లాదరకరమైన వాతావరణాన్ని మనం బాగా కోల్పోతున్నాం. త్వరలోనే మనకు మంచి రోజులొస్తాయి’ అని విన్సెంట్ రాశాడట . దాని స్ఫూర్తితో బాబ్‌ మార్లే ఆడవాళ్లు మీరు ఏడవద్దు అంటూ ఆలపించాడని పూరి చెప్పారు.

కానీ ఈ పాటను మనం అందరమూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నాం. అసలు ఆడవాళ్లే లేకపోతే ఎలాంటి సమస్యలు ఉండవని మనమందరం అనుకుంటున్నాం. జమైకా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా అందరు ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్నారని ‘నో విమెన్‌ నో క్రై’ అనే పదం మినహా పాటలోని మిగతా లిరిక్స్ గురించి అస్సలు ఎవరూ పట్టించుకోలేదు. అలా ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లలో నేను కూడా ఉన్నానని చెప్పారట పూరి.ఒకవేళ ఈ జాబితాలో నాతోపాటు మీరు కూడా ఉంటే ఇకపై పాట విన్నప్పుడు అస్సలు గొడవ చేయొద్దు. ఇది ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే పాట అని నో విమెన్ నో క్రై ’’ అంటూ పూరి చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: