మాస్ మహారాజ్ రవితేజ.. సినిమాల విషయంలో ప్రస్తుతం చాలా స్పీడ్‌గా ఉన్నాడు. అయితే రవితేజ ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక వాటితో పాటు మరికొన్ని సినిమా కథలను వినడానికి కూడా వెనకాడటం లేదు. ఇక ఈ సినిమాల షూటింగ్ విషయానికి వస్తే ఒక దాని తర్వాత ఒకటి నెమ్మది నెమ్మదిగా మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాడు. ఇకపోతే మాస్ మహారాజా తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు.  అయితే రవితేజ నటించే ఈ సినిమాలో రవితేజ ఏకంగా అయిదుగురు భామలతో రొమాన్స్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాల కంటే ముందు రవితేజ ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో  నటించేవాడు.

ఇక ఆ తర్వాత మెల్లగా రూట్ మార్చాడు. డిఫరెంట్ గా సినిమాలను చేస్తున్నాడు.అయితే ఈయన మధ్యమధ్యలో కమర్షియల్ సినిమాలు చేసినా కూడా ఎక్కువగా ప్రయోగాత్మక కథల వైపే మొగ్గుచూపుతున్నాడు.  ఇక ప్రస్తుతం రవితేజ అలా నటిస్తున్న సినిమానే 'రావణాసుర'.  అయితే ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి క్యాస్ట్ వరకు అన్ని అంశాలు కూడా  ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.అయితే యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రియేటివ్ క్రైమ్ కథలకు పెట్టింది పేరు. ఈయన డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న చిత్రమే ఇది. ఇకపోతే ఈ సినిమాలో క్యాప్షన్ హీరోలు అనేవారు లేరు. రవితేజ తో పాటు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో సుశాంత్ నటిస్తున్నాడు.

అయితే ఈ క్యాప్షన్‌ను చూసినట్టైతే.. ఈ సినిమాలో రవితేజ నెగిటివ్  పాత్రలో కనిపించనున్నాడని అంచనా వేస్తున్నారు మాస్ మహారాజా రవితేజ అభిమానులు.ఇక తాజాగా రావణాసుర షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. తాజాగా భోగి పండుగ సందర్భంగా రావణాసుర సినిమా షూటింగ్‌ను అధికారికంగా లాంచ్ చేసింది చిత్ర బృందం.  అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవి గారు హాజరు కావడం జరిగింది. అయితే ఇప్పుడే తాజాగా ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా అయిదుగురు హీరోయిన్లు అని క్లారిటీ వచ్చింది.  ఇక రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో అనూ ఇమాన్యుయల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌తో పాటు తెలుగమ్మాయి పూజితా పొన్నాడ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: