రానా హీరోగా తెరకెక్కిన ఘాజి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా తమిళ ఇంకా హిందీ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఒక విధంగా రానా కారణంగా ఆ సినిమా హిట్ అయ్యింది అనే టాక్ సంకల్ప్ రెడ్డిని లైమ్ లైట్ లోకి తేలకపోయింది. ఒక చిన్న సినిమాగా తెరకెక్కించాలని అనుకున్న సంకల్ప్ కు రానా చాలా బాగా హెల్ప్ అయ్యాడు. ఇక ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని అతనికి చాలా బాగా సపోర్ట్ చేశాడు రానా.మిగతా భాషల్లో కూడా ఈ సినిమాను బాగా క్లిక్ అయ్యేలా చేశాడు. అయితే సంకల్ప్ రెడ్డి రెండవ సినిమా మాత్రం ఊహించని విధంగా పెద్ద డిజాస్టర్ అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేసిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సినిమా విడుదల కంటే ముందు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకా బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా ఘాజి సినిమా దర్శకుడు అనగానే తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపించారు. కానీ ఆ సినిమా మాత్రం అనుకున్నంత ఇంకా ఆశించినంత ఆసక్తికరంగా ఏమి అనిపించలేదు.ఇక ఆ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు రావడంతో సంకల్ప్ మరో అవకాశం అందుకేకపోయాడు. ఆ మధ్య పిట్ట కథలు వెబ్ సీరీస్ కు ఒక వెర్షన్ కు ఇతను డైరెక్షన్ చేశాడు. ఇక ఆ తరువాత అతనికి బాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ రావడంతో గత సంవత్సరం నుంచి అక్కడే చర్చలు కొనసాగిస్తున్నాడు. ఇక బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విద్యుత్ జమ్వాల్ హీరోగా 'ఐబీ 71' అనే హిందీ సినిమాను కూడా స్టార్ట్ చేశాడు సంకల్ప్ రెడ్డి.

విద్యుత్ జమ్వాల్ సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమాని నిర్మిస్తున్నారట.ఎలాగైనా సరే ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా తెర వెనుక ఎన్నో సాహసాలు చేసే ఐబి ఆఫీసర్ల ల జీవితాన్ని ఈ సినిమాలో చూపిస్తారట. ఒక సీరియస్ ఐబీ అధికారిగా విద్యుత్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: