ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఒకవైపు సినిమాల్లో మరోవైపు పాలిటిక్స్ లో సత్తా చాటుతుంటారు. అలాంటి వారిలో బాబు మోహన్ ఒక్కరు. ఆయన కొన్నేళ్ల క్రితం వరకు సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న బాబు మోహన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా ఇంటర్వ్యూల ద్వారా వేర్వేరు విషయాల గురించి వెల్లడించారు.

బాబు మోహన్  వరంగల్ జిల్లాలో పుట్టానని ఖమ్మంలో పెరిగినట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఆయన డిగ్రీ వరకు ఖమ్మంలో చదివానని పేర్కొన్నారు. బాబు మోహన్ మూడో తరగతి చదువుతున్న సమయంలో అమ్మ చనిపోయారని తెలిపారు. ఇక అమ్మను తలచుకుని చాలాసార్లు ఏడ్చానని అమ్మంటే ఇష్టం లేని వ్యక్తులు ఎవరూ ఉండరని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తను ఏడుస్తూ ఉండటంతో కొంతమంది స్నేహితులు ఇంకా ఏడిపించేవారని ఆయన చెప్పుకొచ్చాడు.

ఓ రోజు స్కూల్ లో అమ్మ గురించి ఒకరు తప్పుగా కామెంట్ చేయడంతో ఆ అబ్బాయిని తాను బాగా కొట్టానని బాబు మోహన్ తెలిపారు. ఇక ఆ తర్వాత నా జోలికి ఎవరూ రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎంబాబు మోహన్ కొడుకు చనిపోవడం తీరని లోటు అని పేర్కొన్నారు. అయితే నా జీవితంలో, కోట శ్రీనివాసరావు జీవితంలో కడుపు కోత మిగిలిందని ఆయన పేర్కొన్నారు.

తమ నటనతో ఎంతోమందిని నవ్వించే మాకు దేవుడు విధించిన శిక్ష ఇది అని బాబు మోహన్ పేర్కొన్నారు. అంతేకాదు.. కాయలు ఉండే చెట్టుపైనే రాళ్లు పడతాయని చెప్పుకొచ్చాడు. అయితే  చిరంజీవి మగాడు అని రబ్బర్ అని డ్యాన్స్ విషయంలో మెలికలు తిరుగుతూ అద్భుతంగా చేస్తాడని బాబు మోహన్ పేర్కొన్నాడు. ఇక అప్పట్లో చిరంజీవి రాధ, చిరంజీవి భానుప్రియ, చిరంజీవి విజయశాంతి, చిరంజీవి రాధిక కాంబినేషన్ లో వచ్చిన పాటలు నువ్వా? నేనా? అనేలా ఉండేవని ఆయన పేర్కొన్నారు. కాగా.. చిరంజీవి డ్యాన్స్ ను చూస్తే తనకు ఒక మగాడు వేస్తున్నాడురా డ్యాన్స్ అనిపిస్తుందని బాబు మోహన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: