దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరొకసారి జూలు విదిలిస్తుంది. ఎక్కడికక్కడ అన్ని కార్యకలాపాలు స్పందించి పోయేలా చేస్తుంది. ఇప్పటికే పలుచోట్ల కఠినమైన నియమ నిబంధనలు పెట్టి ప్రభుత్వం కరోనా ను అంతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇంకొకవైపు ప్రజలు ఇదేమీ పట్టించుకోకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే ఈ మూడో వేవ్ కరోనా ఏ విధమైన పరిస్థితులకు దారి తీస్తుందో తెలియదు కానీ సినిమా పరిశ్రమ మీద ఎప్పటిలాగే గట్టి ప్రభావాన్ని చూపించింది కరోనా.

ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. మరి కొన్ని సినిమాలు కూడా వాయిదా పడే ఆలోచనలు చేస్తున్నాయి. అంతేకాదు షూటింగులకు కూడా అంతరాయం కలిగిస్తుంది కరోనా మహమ్మారి. ఇప్పటికే దేశంలోని చాలామంది సెలబ్రిటీలకు కరోనా సోకింది. ప్రస్తుతం ఈ మహమ్మారి నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు వారంతా. అయితే తెలుగులో వరుసగా మూడవ అతిపెద్ద సినిమా ఇప్పుడు వాయిదా పడింది.  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఇప్పుడు వాయిదా పడడం తెలుగు సినిమా పరిశ్రమ ను ఒక్కసారిగా ఇప్పుడు షాక్ కి గురి చేసింది. 

అయితే ఇప్పుడు వాయిదా పడే ఈ సినిమాల ప్రభావం భవిష్యత్తులో వచ్చే సినిమాలపై భారీ ప్రభావం పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే పోయిన ఏడాది విడుదల కావాల్సిన  సినిమాలు ఈ ఏడాది విడుదల అవుతూ మరిన్ని సినిమా విడుదలలు వాయిదా పడే లా చేసింది. మరి ఇప్పుడు ఈ సినిమాలు వాయిదా పడడం భవిష్యత్తులో వచ్చే సినిమాల పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ అలాగే ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలు పోస్ట్ పోస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.  ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఈ సినిమా లు పోస్ట్ పోన్ కావడం నిజంగా పెద్ద మైనస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: