డిసెంబర్ 17వ తేదీన విడుదలైన పుష్ప చిత్రం మేనియా ఏ మాత్రం తగ్గడం లేదు. భారీ స్థాయిలో క్రేజీ అందుకుంటూ రోజురోజుకు క్రేజ్ ను పెంచుకుంటూ పోతుంది. పుష్ప చిత్రం లాంటి ఒక పాన్ ఇండియా సినిమా ఎన్ని రోజులు సస్తైన్ అయింది అంటే నిజంగా ఆ సినిమాలోని గొప్పతనమే దానికి కారణం అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ కు దేశ స్థాయిలో భారీ గుర్తింపు వచ్చేలా చేసిన ఈ సినిమా నిజంగా ఇంత పెద్ద హిట్ అయింది అంటే దానికి కారణం బాలీవుడ్ సినిమా పరిశ్రమ బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు అదే చెప్పాలి.

ఈ సినిమాకు మొదటి నుంచి బాలీవుడ్ సినిమా పరిశ్రమ బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమాను నెత్తిమీద పెట్టుకుని అందలం ఎక్కించింది బాలీవుడ్ సినిమా పరిశ్రమ. అక్కడి వారికి ఈ సినిమా బాగా దగ్గర అవ్వడంతో పాటు ఫ్రెష్ గా అనిపించడంతో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. వాస్తవానికి అల్లు అర్జున్ కు తెలుగులోనే భారీ స్థాయిలో అభిమానులు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సినిమా ను వీక్షిస్తూ ఉంటారు. అలాంటిది తెలుగులో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ చాలా భయపడ్డారు.

ఎన్నో ఆశలు పెట్టుకుని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఈ సినిమా తొలి వారం వచ్చిన టాక్ తో వారం రోజులు ఎంతగానో బాధ పడ్డారు కానీ ఆ తర్వాత కానీ అసలు సంగతి బయట పడలేదు. మెల్లమెల్లగా ఈ చిత్రం బాలీవుడ్ లో ప్రేక్షకులందరికీ ఎక్కడం మొదలు పెట్టింది. అందుకే కాబోలు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఇప్పుడు పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకు వెళుతోంది. అమెజాన్ లో విడుదలైన కూడా ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు. దేశ స్థాయి సెలబ్రిటీలు ప్రపంచ స్థాయి సెలబ్రిటీలు అందరూ కూడా ఈ సినిమాపై షార్ట్ వీడియోలు చేయడం  అందరిని ఎంతగానో అలరిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: