అందాల ముద్దుగుమ్మ రీతు వర్మ, విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో రీతు వర్మ కి టాలీవుడ్ క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా టక్ జగదీష్, వరుడు కావలెను వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. రీతు వర్మ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది, ఇదిలా ఉంటే ప్రస్తుతం రీతూ వర్మ, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

 తన షూటింగ్ అప్డేట్ లను,  ఇతర విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  కొన్ని రోజుల క్రితం కూడా రీతూ వర్మ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ ఎంబ్రాయిడరీ ఉన్న పింక్ కలర్ సారీ కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి, మెడలో ఒక లాకెట్ ను వేసుకుని చాలా క్లాస్ గా, డీసెంట్ గా ఫోటో కు స్టిల్ ఇచ్చింది, ఇలా ఎంతో క్లాస్ గా, డీసెంట్ గా చీరకట్టుతో రీతూ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పటికి కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: