ఆయన హీరో గా పూరీ జగన్నాథ్ దర్శత్వంలో లైగర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. రమ్య కృష్ణ, మైక్ టైశన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కి సంబంధించి గ్లింప్స్ విడుదల కాగా దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు దీనిని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. టాప్ రేంజ్ హీరో కి ఉన్న క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కు ఈ స్థాయి లో మద్దతు రావడం అంటే మామూలు విషయం కాదు.
అలా ఆయన స్టార్ డం కు తగ్గ రెస్పాన్స్ వచ్చి సినిమా పై అంచనాలను భారీ గా పెంచింది. బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ చేస్తున్న హార్డ్ వర్క్ చూసి అందరూ ఎంతో ఆశ్చర్య పోతున్నారు. ఈ సినిమా లో దేహదారుఢ్య బాగా కనిపించాలని ఆయన షూటింగ్ గ్యాప్ లో భారీ గా కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండగ సమయం లో కూడా ఆయన జిమ్ లో కష్టపడుతున్నారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరి హిట్ కొట్టి చాలా రోజులవుతున్న నేపథ్యం లో విజయ్ ఈ సినిమా తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.