సెలబ్రిటీలకు సంబంధించిన లైఫ్ గురించి ప్రతీ విషయం కూడా అటు అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక సామాన్య ప్రజలందరూ కూడా సినిమా వాళ్ళలా ఒక్కరోజైనా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్లకి ఏంట్రా బాబు ముఖానికి మేకప్ వేసుకుని నటిస్తూ కోట్లకి కోట్లు వెనకేసుకుంటారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ సాధారణ ప్రజల మాదిరిగానే సెలబ్రిటీలు కూడా వారి జీవితంలో ఎన్నో ఒత్తిళ్లను ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు సినీ సెలబ్రిటీల. ఆరోగ్య సమస్యలు కొన్ని ప్రాణాలమీదికి తెలుస్తూ ఉంటాయి. మరి కొన్నిసార్లు కాలం కలిసి రాక ప్రాణాలు కోల్పోయినా సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారూ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


 ఆర్తి అగర్వాల్ : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ హోదాను సాధించింది ఈ ముద్దుగుమ్మ. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తరుణ్ తో కలిసి నటించిన 'నువ్వు లేక నేను' తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక వరుస సినిమ అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అనుకోని విధంగా బరువు పెరిగిపోయింది. తగ్గించుకునేందుకు లైపోసక్షన్ చేయించుకుంది ఆర్తి అగర్వాల్. ఇక ఈ దీని ప్రభావం కారణంగా చివరికి 2015లో హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా తుది శ్వాస విడిచింది.


 సౌందర్య : తెలుగు ప్రజల ప్రతి ఒకరి హృదయాలకు చాలా దగ్గరైన హీరోయిన్లలో సౌందర్య కూడా ఒకరు   తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ కొన్ని రోజుల్లోనే తెలుగింటి అమ్మాయి అనే పేరు సంపాదించింది. ఇక దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఎంతో సక్సెస్ఫుల్గా కెరియర్ కొనసాగుతున్న సమయంలోనే విమాన ప్రమాదంలో మృతి చెందింది సౌందర్య. 2004 లో సౌందర్య మరణించింది.

 ఉదయ్ కిరణ్ : టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే లవర్ బాయ్ గా  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. ఒకానొక సమయంలో అతని కెరీర్ పిక్స్ లోకి వెళ్లి స్టార్ హీరోలకు సైతం ఉదయ్ కిరణ్ సినిమాలు పోటీ ఇచ్చాయి. కానీ మానసిక ఒత్తిళ్ల వల్లే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.


 ప్రత్యూష : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్ర లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రత్యూష మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఎన్నో సమస్యలు చుట్టుముట్టడం తో మనస్థాపం చెంది 2002లో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.


 శ్రీహరి  : హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీహరి.. ప్రేక్షకులందరికీ రియల్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఎంతో సక్సెస్ఫుల్గా కెరియర్ కొనసాగుతున్న సమయంలోనే 2013లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా 2014లో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.  స్టార్ కమెడియన్ వేణుమాధవ్ కూడా క్యాన్సర్తో పోరాడుతూ చనిపోయారు. ఇలా ఇంకా ఎంతోమంది కెరీర్లో మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే అర్ధాంతరంగా ప్రాణాలు వదిలారు.

మరింత సమాచారం తెలుసుకోండి: